కేంద్రం లాక్ డౌన్ పెట్టబోతున్నదా ?
దేశంలో కరోనా వైరస్ కేసులతో పాటు పెరిగిపోతున్న ఒమిక్రాన్ కేసుల తీవ్రతను చూసిన తర్వాత అందరికీ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం తొందరలోనే కేంద్రప్రభుత్వం లాక్ డౌన్ విధించే అవకాశాలున్నాయట. ఈసారి విధించబోయే లాక్ డౌన్ రెండు రోజులు మాత్రమే ఉంటుందట. ఆ రెండు రోజులు ఏమిటంటే ఈనెల 31వ తేదీ, కొత్త సంవత్సరం జనవరి 1వ తేదీ అని చెబుతున్నారు.
ఈ రెండు రోజులు ఎందుకంటే డిసెంబర్ 31వ తేదీ అంటే సంవత్సరానికి వీడ్కోలు చెప్పి హ్యాపీ న్యూయర్ అంటు కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు జనాల్లో అత్యధికులు డిసెంబర్ 31వ తేదీ రాత్రి 12 గంటల సమయంలో రోడ్లపైకి వచ్చేస్తారు. పాత సంవత్సరానికి వీడ్కోలు కొత్త సంవత్సరానికి ఆహ్వానం పేరుతో డిసెంబర్ 31 సాయంత్రం నుండే చాలామంది పార్టీ మూడ్ లోకి వెళిపోవటం అత్యంత సహజమే. కాబట్టి ఒకేసారి రెండు కార్యక్రమాలు జరగుతాయి కాబట్టి దేశవ్యాప్తంగా చాలామంది జనాలు పార్టీల పేరుతో రోడ్లపైకి విపరీతంగా వచ్చేస్తారు.
ఎప్పుడైతే జనాలంతా ఒకేసారి రోడ్లపైకి, హోటళ్ళు, రిసార్టులు, పబ్బులు, కమ్యూనిటి హాళ్ళల్లో పార్టీలకు గ్యాదర్ అవుతారో కరోనా వైరస్ లేదా ఒమిక్రాన్ సోకే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఆందోళన పడుతున్నారు. కరోనా వైరస్, ఒమిక్రాన్ భయం కారణంగా వేడుకలను, పార్టీలను అన్నింటినీ క్యాన్సిల్ చేసుకుని జనాలను ఎవరిళ్ళల్లో వాళ్ళని కూర్చోమని కేంద్రం చెబుతోంది.
డిసెంబర్ 31 రాత్రి ఒక పద్దతి అయితే జనవరి 1వ తేదీన కొత్త సంవత్సరం పేరుతో జరిగే హడావుడి అంతా ఇంతా కాదు. కొత్త సంవత్సరం మొదటిరోజు పేరుతో జనాలు గుళ్ళకు వెళ్ళటం, హాళ్ళల్లో పార్టీలు, భోజనాలతో చాలా సందడిగా ఉంటారు. అంటే ఎక్కడైతే పబ్లిక్ గ్యాదరింగ్ ఉంటుందో అక్కడంతా కరోనా వైరస్, ఒమిక్రాన్ సోకే ప్రమాదం ఉందని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి పబ్లిక్ గ్యాదరింగ్ ను కంట్రోల్ చేయటానికే కేంద్రప్రభుత్వం లేదా రాష్ట్రప్రభుత్వాలు డిసెంబర్ 31, జనవరి 1వ తేదీన లాక్ డౌన్ పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.