జేసీ-కోట్ల-నల్లారి ఫ్యామిలీలు ఈ సారైనా సక్సెస్ అవుతాయా?
ఇలా కాంగ్రెస్‌లో కీలకంగా పనిచేసిన ఈ మూడు బడా ఫ్యామిలీలు ఇప్పుడు టీడీపీలో రాజకీయం చేస్తున్నాయి. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పని క్లోజ్ కావడంతో మూడు ఫ్యామిలీలు టీడీపీలోకి వచ్చి రాజకీయం నడిపిస్తున్నాయి. మొదట జేసీ ఫ్యామిలీ టీడీపీలోకి వచ్చింది. అనంతపురం జిల్లాకు చెందిన జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డిలు పార్టీలోకి వచ్చారు. అలాగే వాళ్ళ ఇద్దరు కుమారులు పవన్, అస్మిత్‌లు సైతం టీడీపీలో పనిచేస్తున్నారు.
ఇటు చిత్తూరులో కిరణ్ సోదరుడు నల్లారి కిషోర్ టీడీపీలోకి వచ్చి పనిచేస్తున్నారు. గత ఎన్నికల ముందు కర్నూలు జిల్లాకు చెందిన సూర్యప్రకాశ్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, ఆయన భార్య సుజాతమ్మలు టీడీపీలోకి వచ్చారు. అయితే గత ఎన్నికల్లో ఈ మూడు ఫ్యామిలీలు టీడీపీ నుంచి పోటీ చేసి..దారుణంగా ఓడిపోయాయి. కానీ ఈ సారి మాత్రం ఖచ్చితంగా గెలవాలనే కసితో పనిచేస్తున్నారు.