ఇదేందయ్యా ఇది.. దేంతో పకోడీ చేసాడో తెలుసా?

praveen
కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ వచ్చిన సమయంలో దాదాపు అందరూ ఇంటికే పరిమితమయ్యారు.. ఎప్పుడు ఉద్యోగాలు వ్యాపారం అంటూ ఫ్యామిలీకి దూరంగా ఉండే వారికి సైతం ఇక ఇంట్లో ఫ్యామిలీతో గడిపే సమయం దొరికింది అని చెప్పాలి. అయితే లాక్డౌన్ విధించినప్పుడు దొరికిన సమయాన్ని ఎంతో మంది కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉపయోగించారు. అయితే ఎంత మంది కొత్త విషయాలు నేర్చుకున్నారో అన్నది తెలియదు కానీ కొత్త వంటకాలు  మాత్రం దాదాపు అందరు నేర్చుకున్నారు అని చెప్పాలి.



 ఈ క్రమంలోనే చిత్ర విచిత్రమైన వంటలు తయారు చేసి ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో వంటకాలను నేర్చుకున్నారు ఎంతోమంది. అయితే ఏంటో కరోనా వైరస్ ప్రభావం తగ్గి లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా ఈ కొత్త వంటకాలు చేయడం మాత్రం ఆపటం లేదు ఎంతోమంది. ఎప్పుడూ వినూత్నమైన రీతిలో క్రేజీ కాంబినేషన్స్ తో వంటకాలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇటీవలే సోషల్ మీడియాలో నల్ల ఇడ్లీలు, పానీపూరి ఐస్ క్రీమ్ లాంటివి  వైరల్ గా మారిపోయాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో వంటకం కూడా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది.



 సాధారణంగా ఎర్రగా నిగనిగలాడి పోయే యాపిల్ ను అందరూ కోసుకొని తింటారు. యాపిల్ తో పకోడీలు చేయడం గురించి ఎప్పుడైనా విన్నారా.. యాపిల్ తో పకోడీలు చేయడం ఏంటండీ మరి వింత కాకపోతే అని అంటారు ఈ మాట చెబితే ఎవరైనా. కానీ ఇలాంటిదే ట్రై చేసాడు ఇక్కడ ఒక వ్యక్తి. ఏకంగా ఒక యాపిల్ ను కట్ చేసి నూనెలో వేయించి పకోడీ చేసుకున్నాడు. అంతేకాదు ఈ యాపిల్ పకోడీలు ఎంతో టేస్ట్ గా ఉన్నాయి అంటూ చెబుతున్నాడు సదరు వ్యక్తి. ఇక దీనికి సంబంధించిన వార్త కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది. యాపిల్ పకోడి పై భిన్నమైన కామెంట్లు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: