కొద్ది రోజులు కలిసి ఉంటే.. అది సహజీవనం కాదు : హైకోర్టు
ఇప్పుడు ఇలాంటిదే జరిగింది. ఇటీవలే మేజర్లుగా మారిన ఒక జంట సహజీవనం చేస్తూ కలిసి ఉంటుంది. ఇక వీరి సహజీవన విషయం చివరికి తల్లిదండ్రుల వరకు వెళ్ళింది. దీంతో ఇద్దరు యువతీ యువకులను మందలించి వీరిద్దరినీ విడదీసేందుకు ప్రయత్నించారు తల్లిదండ్రులు. కానీ తల్లిదండ్రుల మాట వినిపించుకోని ఇద్దరు మేనేజర్లు తాము సహజీవనం చేస్తున్నాము అంటూ కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే కోర్టు ఇచ్చిన తీర్పు కాస్త ప్రస్తుతం సంచలనంగా మారిపోయింది.
కేవలం కొన్ని రోజులు మాత్రమే కలిసి ఉన్నంత మాత్రాన దాన్ని సహజీవనం గా గుర్తించ లేము అంటూ ఇటీవల పంజాబ్ హర్యానా హైకోర్టు సంచలన తీర్పును వెలువ రించింది. ఇంట్లో నుండి పారి పోయిన ఓ యువ జంట కలిసి ఉంటూ కొన్ని రోజుల్లోనే పెళ్లి చేసు కుందామని నిర్ణయించు కున్నారు.. ఈ క్రమం లోనే వీరి ఆచూకీ తెలిసిన అమ్మాయి కుటుంబ సభ్యులు బెదిరింపులకు పాల్పడటం మొదలు పెట్టారు. ఈ క్రమం లోనే తాము సహ జీవనం చేస్తున్నాము అంటూ ఈ యువ జంట హైకోర్టును ఆశ్రయించింది. అయితే వీరి వాదనలను తోసి పుచ్చిన హైకోర్టు ఏకంగా వారికి 25 వేల జరిమానా కూడా విధించింది గమనార్హం.