మోదీని నిలదీసిన సామాన్యుడు.. ఏం అడిగాడో తెలుసా?

praveen
రోజు రోజుకి భారతదేశంలో పన్నుల భారం సామాన్యుడిపై పెరిగిపోతూనే ఉంది. సామాన్యుడు కొనే ప్రతీ వస్తువుకు కూడా తప్పనిసరిగా పన్ను కట్టాల్సి ఉంటుంది. ఇక ఇటీవల కాలంలో జీఎస్టీ కారణంగా ఇక ప్రతి వస్తువు పై టాక్స్ కాస్త ఎక్కువగానే వసూలు చేస్తున్నారు అని చెప్పాలి. అయితే పేద మధ్యతరగతి ప్రజలు ఎంతో కష్టపడి చదివి మంచి ఉద్యోగం సంపాదించిన తర్వాత ఇక సంపాదించిన దాంట్లో మళ్ళీ కొంత మొత్తాన్ని ప్రభుత్వానికి టాక్స్ గా చెల్లించాల్సి వస్తుంది.. ఇలా ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రతి ఒక సామాన్యుడు ప్రభుత్వానికి టాక్స్ చెల్లిస్తూ ఉండడం గమనార్హం.


 అయితే ఈ టాక్స్ భారం పెరిగి పోతూ ఉండడంతో సామాన్యుడి జీవితం రోజు రోజుకు మరింత భారంగా మారి పోతుంది. అయితే ఇక ఈ టాక్స్ ల గురించి ప్రభుత్వానికి ప్రశ్నించాలని ఉన్నప్పటికీ చాలా మంది సామాన్యులు మనకెందుకులే అని ఊరుకుండి పోతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం అప్పుడప్పుడు ప్రభుత్వాన్నిప్రశ్నిస్తూ లేఖలు రాస్తూ ఉండడం చేస్తూ ఉంటారు. ఇక్కడ ఓ యువకుడు ప్రభుత్వానికి లేఖ రాశాడు. ఏకంగా లేఖలో ప్రధాని నరేంద్ర మోడీని ఊహించని ప్రశ్నలు అడిగి నిలదీశాడు. ఇక ప్రస్తుతం ఒక కామన్ మ్యాన్ రాసిన లేఖ లేఖలోని అంశాలు కాస్తా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయ్.


 హైదరాబాద్లో నివసించే ప్రసాద్ అనే వ్యక్తి స్వయంగా నరేంద్ర మోడీ కి ఒక లేఖ రాశారు. నేను పేద ఇంట్లో పుట్టాను పైసా పైసా కూడబెట్టి చదువుకున్నాను. ఇక ఇప్పుడు మంచి ఉద్యోగం వచ్చింది.  ప్రస్తుతం నేను  నెలకు రెండు లక్షల వరకు సంపాదించగలుగుతూన్నాను. అయితే నేను సంవత్సరానికి మూడు లక్షల రూపాయల పన్ను ఎందుకు కట్టాలి అని ప్రశ్నించాడు. నేను కొనే ప్రతి వస్తువు పైన కూడా టాక్స్ కడుతున్నాను. అలాంటప్పుడు మళ్లీ నేను సంపాదించిన దాంట్లో ఎందుకుపన్ను కట్టాలి అంటూ ప్రశ్నించాడు. ఇది ఒక ప్రసాద్ ప్రశ్న మాత్రమే కాదు ఇక  జీతాల నుంచి టాక్స్ కడుతున్న  ఎంతో మంది మనసులో ఉన్న ప్రశ్న అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: