హైకోర్టుతో ఏపీ సర్కార్ వార్... తగ్గేదే లే..!
ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ... కొంత మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక అక్కడ బ్రేక్ పడింది. టికెట్ల విక్రయంపై ప్రభుత్వ పెత్తనం ఏమిటని ప్రశ్నించింది హైకోర్టు. ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేస్తున్నాట్లు ప్రకటించింది. అయితే దీనిని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఏదీ ఏమైనా సరే... తగ్గేదే లే అన్నట్లుగా కనిపిస్తున్నారు. ఇప్పటికే సినిమా టికెట్ల విషయంలో సెంటర్ల వారీగా ధరలు కూడా ఖరారు చేసింది జగన్ సర్కార్. ఇందుకు అనుగుణంగా జీవో నంబర్ 35 జారీ చేసింది. ఈ జీవో రద్దు చేయాలంటూ డిస్ట్రిబ్యూటర్లు హైకోర్టును ఆశ్రయించారు. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత... జీవో కొట్టి వేస్తున్నట్లు హైకోర్టు తీర్పు వెలువరించింది. దీనిపైన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న ప్రభుత్వ పెద్దలు... డివిజన్ బెంచ్‌లో అప్పీలుకు వెళ్లింది. కొత్త సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో... దీనిని వెంటనే విచారించాలని కోరుతూ... డివిజన్ బెంచ్‌లో లంచ్ మోషనఅ పిటీషన్ దాఖలు చేసింది జగన్ ప్రభుత్వం.