భూమా ఫ్యామిలీకి రాజకీయం ముగిసింది...!
భూమా నాగిరెడ్డి అంటే ఆళ్లగడ్డ - నంద్యాల నియోజక వర్గాల ప్రజలకు ఒక పెద్దదిక్కుగా ఉంటూ వచ్చారు. జిల్లా రాజకీయాల్లో ఆయన సుదీర్ఘ కాలంగా చక్రం తిప్పారు. నంద్యాల ను సైతం తన కనుసైగలతో కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. గతంలో ఆయన నంద్యాల ఎంపీ గా పని చేసి ఉండడంతో నంద్యాల - ఆళ్లగడ్డ రెండు నియోజకవర్గాల్లో ఆయన కంట్రల్లో ఉండేవి.
శోభ నాగిరెడ్డి - భూమా నాగిరెడ్డి హఠాన్మరణం తర్వాత వారి కుమార్తె అఖిలప్రియ అనూహ్యంగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అవ్వడంతో పాటు .... జాక్పాట్ లో మంత్రి పదవి కొట్టేశారు. అయితే 2019 ఎన్నికల్లో మాత్రం అఖిలప్రియకు చుక్కలు కనిపించాయి. ఆమె చేతిలో ఘోరంగా ఓడిపోయారు. మరోవైపు ఆమె భర్త భార్గవ్ రామ్ వరుస వివాదాల్లో ఇరుక్కుంటున్నారు.
ఇక అఖిలప్రియ సైతం ఓ కిడ్నాప్ కేసులో ఏకంగా జైలు కి వెళ్లి వచ్చారు. ఇలా వరుస వివాదాల నేపథ్యంలో అఖిలప్రియ ఇమేజ్ పూర్తిగా తగ్గిపోయింది. మరోవైపు అఖిలప్రియకు వరుసకు అన్నయ్య అయ్యే భూమా కిషోర్ రెడ్డి ఇప్పుడు ఆళ్లగడ్డ రాజకీయాల్లో దూసుకుపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి టిక్కెట్ ఆయనకే దక్కుతుంది అన్న ప్రచారం కూడా నడుస్తోంది.
అదే జరిగితే చంద్రబాబు కూడా భూమా నాగిరెడ్డి కుటుంబాన్ని పూర్తిగా పక్కన పెడతారని అంటున్నారు. ఏదేమైనా గతంలో మంత్రి అయి ఒక రేంజ్ లో చక్రం తిప్పిన అఖిలప్రియ రాజకీయానికి వచ్చే ఎన్నికలకు ముందుగానే తెర పడిపోయే పరిస్థితి కనిపిస్తోంది.