తెలంగాణలో
కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడం కోసం ఆ
పార్టీ నేతలు ఎప్పటి నుంచో చాలా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు.
రేవంత్ రెడ్డి టీ పీసీసీ చీఫ్ గా పగ్గాలు చేపట్టిన తర్వాత
కాంగ్రెస్ పార్టీలో సమూల మార్పులు తీసుకువస్తూ, ముందుకు సాగుతున్నారు. ఆ దిశలోనే పలువురు నాయకులను
కాంగ్రెస్ పార్టీలోకీ తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ చర్చలు జరుపుతున్నారు. ఈ విధంగా ఆయన కెసిఆర్ కు
చెక్ పెట్టేందుకు తమదైన శైలిలో వ్యూహాలు రచిస్తూ ముందుకు పోతున్నారు. ఈ వ్యూహంలో భాగంగా కొన్ని చిన్నచిన్న పార్టీలపై దృష్టి సారించాలని సమాచారం.
తెలంగాణ ఉద్యమంలో పని చేసినటువంటి చెరుకు
సుధాకర్ సారథ్యంలో మొదలైనటువంటి
తెలంగాణ ఇంటి పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన సొంత
పార్టీ పెట్టి తెలంగాణలో రాజకీయాన్ని నడిపించాలని భావించి సుధాకర్ రెడ్డి విజయవంతం కాలేకపోయారు.
దీంతో ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేందుకు ముందుకొచ్చారు. ఇంకోవైపు తన భార్యను పోటీ చేయించాలని భావిస్తున్న చెరుకు
సుధాకర్ దీని కోసమే
కాంగ్రెస్ పార్టీలో చేరాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. చెరుకు
సుధాకర్ ఆయన సతీమణి లక్ష్మి, కుమారుడితో సహా
కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తాజా సమాచారం. అయితే ఆయన చేరిక విషయంలో ఏఐసిసి కీలక నేత కొప్పులరాజు సందనకర్తగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.
రేవంత్ రెడ్డి కూడా ఆయన చేరికను ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ నెల 14న నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహించి పెద్ద ఎత్తున అనుచరగణంతో
కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. నకిరేకల్ నియోజకవర్గానికి చెందిన చెరుకు
సుధాకర్ ఉమ్మడి
నల్గొండ జిల్లాలో చాలా ఫాలోయింగ్ ఉన్న నేత.
తెలంగాణ ఉద్యమంలో కూడా క్రియాశీలకమైన పాత్ర పోషించారు. ఆ తర్వాత కెసిఆర్ పిలుపుమేరకు టిఆర్ఎస్లో చేరారు. తర్వాత తెరాసలో ఆయనకు నచ్చక కెసిఆర్ తో విభేదాలు వచ్చి తెలంగాణలో సొంత
పార్టీ ఇంటి
పార్టీ పేరుతో పెట్టేశారు. చెరుకు
సుధాకర్ 2021లో జరిగిన శాసన మండలి ఎన్నికల్లో ఖమ్మం,నల్గొండ, పట్టభద్రుల ఎమ్మెల్సీ లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో అధికార పార్టీని కొట్టాలంటే నేను సరిపోను అని భావించి జాతీయ పార్టీలో విలీనం చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు