సీఎం కేసీఆర్ కు లేఖ.. అంతలోనే ఆత్మహత్య?
అయితే అటు ప్రకృతి కూడా దేశానికి అన్నం పెట్టే రైతన్న పై పగ పట్టిన వ్యవహరిస్తోంది. ఎన్నో అవాంతరాలు దాటుకుని పంట పండిస్తే రైతుకు గిట్టుబాటు ధర లేక చివరికి మళ్లీ అప్పుల ఊబిలో కూరుకు పోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ఇలా దేశానికి అన్నం పెట్టే రైతన్న జీవితం రోజురోజుకూ దుర్భరంగా మారిపోతుంది. రోజురోజుకు ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోతుండటంతో పెట్టిన పెట్టుబడి కూడా రాక మనస్తాపం చెందిన ఎంతో మంది రైతులు నేల రాలిపోతున్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో ఇక ఆరుగాలం కష్టపడిన ఆ నేల పైనే పురుగుల మందు తాగి ప్రాణాలు వదులుతున్న రైతులు ఈ రోజుల్లో ఎక్కువై పోతున్నారు.
ఇలా రైతు ఆత్మహత్యలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తప్ప ఎక్కడా తగ్గడం లేదు అని చెప్పాలి.. ఇక్కడ మరో రైతు ప్రాణం పోయింది. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదని.. ఇంజనీరింగ్ చదివిన కూడా తన కొడుకుకి ఉద్యోగం రాలేదని మనస్థాపంతో చెందాడు 40 ఏళ్ల రవి కుమార్ అనే రైతు. చివరికి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలం బుద్ధ భూపతిపూర్ వెలుగులోకి వచ్చింది. సంఘటనా స్థలం వద్ద సీఎం కేసీఆర్ కు మృతుడు రవి రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గిట్టుబాటు ధర రాక పోవడం కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నాను అంటూ రైతు లేఖలో పేర్కొన్నాడు.