అగ్రదేశాల ముందు చూపు.. చిన్న దేశాలకు శాపమే : డబ్ల్యూహెచ్ఓ

praveen
ప్రస్తుతం ప్రపంచ దేశాలను ఓమిక్రాన్ వైరస్ వణికిస్తోంది. డెల్టా వేరియంట్ కంటే వెలుగులోకి వచ్చిన కొత్త వేరియంట్ మరింత ప్రమాదకారి అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ప్రపంచ దేశాలు అప్రమత్తం కావాలి అంటూ ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు జారీ చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాలు అప్రమత్తమై పోతున్నాయి. ఓమిక్రాన్ వైరస్ నుంచి తమ దేశాన్ని కాపాడుకునేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే ఇప్పటికే దాదాపుగా అన్ని దేశాలలో కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ 100 శాతం పూర్తయింది అని చెప్పాలి. అగ్రరాజ్యాల లో అయితే పూర్తి వంద శాతం జనాభా రెండు డోసుల వ్యాక్సిన్లు తీసుకొని ఉన్నారు.

 ఈ క్రమంలోనే ప్రస్తుతం ఓమిక్రాన్ వైరస్ కారణంగా మళ్లీ విపత్కర పరిస్థితులు రాకుండా ఉండేందుకు ఇప్పటికే కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకు వస్తున్నాయి అగ్రరాజ్యాలు. అదే సమయంలో ఇక బూస్టర్ డోసు కూడా అవసరమని అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉండటం గమనార్హం. ఇక బూస్టర్ డోసు అవసరం అనే ఉద్దేశంతో భారీగా టీకాలను నిల్వలు చేస్తూ ఉండటం గమనార్హం.. అగ్రరాజ్యాల ముందు చూపు కాస్త ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ కొరతను ఏర్పరుస్తుంది. అగ్రరాజ్యాల ముందు చూపు చిన్న దేశాల కు శాపంగా మారిపోతుంది. ఇక ఇటీవల ఇదే  విషయంపై  ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాక్సిన్ చీఫ్ ఓబ్రియాన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

 బూస్టర్ డోస్ వేసుకోవడం వల్ల కొత్త వేరియంట్ను ఓమిక్రాన్ నుంచి రక్షణ పొందగలమా లేదా అనే విషయంపై పై ఎలాంటి స్పష్టత లేదు అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అగ్రదేశాలు టీకాలను భారీగా నిల్వ చేసుకోవడం సరైనది కాదు అంటూ వ్యాఖ్యానించారు. ఇలా భారీగా టీకా నిల్వలను పెంచుకుంటూ ఉండటం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు ఉన్న వ్యాక్సిన్ అసమానత మరింత పెరిగే అవకాశం ఉంది అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆరోగ్య సిబ్బంది సహా అధిక ముప్పు ఉన్న ప్రజలకు కనీసం ఒక డోసు కూడా అందించని దేశాలు ఇప్పటికీ చాలానే ఉన్నాయి అంటూ అయన వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: