క్రాష్ : బిపిన్ రావత్ చివరి కోరిక ఏంటో తెలుసా?

praveen
భారత రక్షణరంగం లో మొట్టమొదటి త్రివిధ దళాధిపతి గా ఎన్నుకో బడ్డారు బిపిన్ రావత్. అప్పటికే ఆర్మీలో ఎంతగానో సేవలందించిన బిపిన్ రావత్ కు అరుదైన గౌరవం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం త్రివిధ దళాధిపతి గా నియమించింది. ఎప్పుడు ముక్కుసూటిగా మాట్లాడుతూ అన్ని దేశాలతో కూడా సైనికపరమైన సంబంధాలు మెరుగు పరుచుకుంటూ వచ్చారు.. అయితే ఇటీవలే అనుకోని విధంగా తమిళనాడు లోని నీలగిరి హిల్స్ వద్ద హెలికాప్టర్ లో ప్రయాణిస్తున్న సమయంలో సాంకేతిక లోపంతో హెలికాప్టర్ కుప్పకూలి తునాతునకలు అయింది.

 ఈ ప్రమాదంలో త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ దుర్మరణం పాలయ్యారు. ఆయనతో పాటు ఆయన సతీమణి పలువురు అధికారులు కూడా మరణించారు. ఈ ఘటన ఎంతో సంచలనంగా మారిపోయింది. ప్రస్తుతం దేశ ప్రజానీకం మొత్తం బిపిన్ రావత్ మృతి పై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.. అయితే బిపిన్ రావత్  చివరి కోరిక తీరకుండానే చనిపోయారట. బిపిన్ రావత్ రిటైర్ అయిన తరువాత ఉత్తరాఖండ్లోని స్వగ్రామమైన సైనా లో  ఇల్లు కట్టుకోవాలని ఆశ పడ్డారట. 2018లో చివరిసారిగా బిపిన్ సొంతూరు ను సందర్శించి ఈ నిర్ణయం తీసుకున్నారట.

 పౌరీ జిల్లాలోని ద్వారీ కల్ బ్లాక్ లో బిపిన్ రావత్ సొంతూరు  సైని గ్రామం ఉంది.. ఇక ఈ ఊర్లో ప్రస్తుతం రావత్  బంధువుగా కొనసాగుతున్నారు భరత్. బిపిన్ రావత్ దుర్మరణం తర్వాత ఈ విషయాన్ని భారత చెప్పుకొచ్చారు.. 2018 లో బిపిన్ రావత్ స్వగ్రామానికి వచ్చినప్పుడు కుల దేవతకు పూజలు చేశారు. అనంతరం ఇక తన సొంత గ్రామంలో ఇల్లు నిర్మించుకుంటాను అంటూ చెప్పారు సొంత గ్రామం పై ఎంతో అభిమానం ప్రేమను బిపిన్ రావత్ కలిగివుండేవారు అంటూ భరత్ చెప్పుకొచ్చారు. రిటైరైన తర్వాత ఇక తన సొంత గ్రామం కోసం ఏదైనా చేస్తాను అంటూ బిపిన్ మాట్లాడే వారు  అంటూ గుర్తు చేసుకున్నారు. ఇలా బిపిన్ రావత్ కోరిక తీరకుండానే ఇలా జరుగుతున్నది మాత్రం ఊహించలేదు అంటూ కన్నీటి పర్యంతం అవుతూ చెప్పుకొచ్చారు భరత్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: