భారత్-పాక్ సరిహద్దుల్లో ప్రసవం.. బిడ్డకు ఏం పేరు పెట్టారో తెలుసా?
ఓ మహిళ అనుకోని కారణాల వల్ల ఏకంగా భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లోని పురుడు పోసుకుంది.. ఇక ఆమెకు పండంటి మగ బిడ్డ పుట్టింది. ఆ శిశువుకు బార్డర్ అని పేరు పెట్టడం కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.. పాకిస్థాన్‌కు చెందిన హిందూ మహిళ గత కొద్ది నెలల నుంచి సొంత దేశమైన పాకిస్థాన్ వెళ్లేందుకు భారత్ సరిహద్దుల్లో పడిగాపులు కాస్తున్నారు. ఆమెతో పాటు దాదాపు లాక్ డౌన్ సమయంలో చిక్కుకుపోయిన 100 మంది పౌరులు కూడా ఇండియా హద్దుల్లోనే టెంట్ల కింద జీవనం సాగిస్తున్నారు.. ఇలా ఎంతోమంది ఏకంగా సరిహద్దుల్లోనే జీవనం సాగిస్తూ పిల్లలను కూడా కన్నారు. పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావీన్స్ కి చెందిన బాలమ్ రామ్ నింబుబాయ్ దంపతులు ఇలా సరిహద్దుల్లో ఎన్నో రోజుల నుంచి పడిగాపులు కాస్తున్నారు.
భారత్‌లో ఉన్న ఆలయాలను సందర్శించడం తో పాటు బంధువులను కలిసేందుకు భారత్ లోకి వచ్చారు. సందర్శనను ముగిసిన తర్వాత మళ్ళీ స్వదేశానికి వెళ్లాలని భావించారు. కానీ అంతలోనే లాక్డౌన్ అమలులోకి వచ్చింది. ఇలా 97 మంది భారత్‌లోనే చిక్కుకుపోయారు. ఇక లాక్డౌన్ ఎత్తివేత తర్వాత స్వదేశానికి బయలుదేరగా సరిహద్దు వద్ద పాక్ రేంజర్లు వారిని అడ్డుకున్నారు. ఇందులో మనం చెప్పుకునే దంపతులు కూడా ఉన్నారు. ఇక అప్పటికే ఏడు నెలల గర్భంతో ఉన్న నింబు దేవి సరిహద్దుల్లో టెంట్ల కింద పడిగాపులు కాసింది. చివరికి డిసెంబర్ 2వ తేదీన పురిటినొప్పులు రాగా అక్కడ ఉన్న బంధువులు ఆమెకు పురుడు పోయగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇక డెలివరీ సరిహద్దులో కావడంతో పుట్టిన బిడ్డకి బార్డర్ అని పేరు పెట్టినట్లు తల్లిదండ్రులు చెప్పారు.