
హమ్మయ్య.. ఆమెకు ఓమిక్రాన్ సోకలేదు?
అయితే ఇక ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకున్న డెల్టా వేరియంట్ కంటే ఇక ఇప్పుడు వెలుగులోకి వచ్చిన కొత్త వేరియంట్ ఓమిక్రాన్ 5 రేట్లు మరింత ప్రమాదకారి అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించిన నేపథ్యంలో ప్రపంచ దేశాలలో మళ్లీ భయం పెరిగిపోయింది. అటు రెండవ దశ కరోనా వైరస్ తో అల్లాడిపోయిన భారత్ కూడా ఇక ఇప్పుడు మూడవ దశ కూడా ముంచుకు వస్తుంది అని చెప్పడంతో అప్రమత్తమైంది. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎత్తివేసిన కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా ఎయిర్పోర్టులో విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు తప్పనిసరిగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఇక పోతే ఎన్నో వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి. అయితే ఇటీవలే బ్రిటన్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఒక మహిళకు ఓమిక్రాన్ వైరస్ సోకింది అంటూ ఎన్నో వార్తలు హల్ చల్ చేశాయి. ఈ క్రమంలోనే ఆమెకు పరీక్షలు నిర్వహించారు. అయితే రిపోర్టులో నెగిటివ్ అని నిర్ధారణ అయినట్లు ఇటీవలే వైద్యులు తెలిపారు. మరో 12 మంది బ్రిటన్ నుంచి వచ్చిన ప్రయాణికుల రిపోర్టులు రావాల్సి ఉంది అంటూ చెప్పుకొచ్చారు అయితే మొదట ఓమిక్రాన్ వైరస్ సోకింది అధికారులు భావించడంతో అందరిలో భయం పట్టుకుంది. కానీ ఇప్పుడు ఆమెకు నెగిటివ్ రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.