
జవాద్ ఎఫెక్ట్: రేపు జరగాల్సిన పరీక్షలు వాయిదా...
అదే విధంగా ఐఐఎఫ్ లో (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్) ఎంబీఏ ప్రవేశాల కోసం కండక్ట్ చేసే ఎంట్రీ పరీక్ష ని కూడా జాతీయ పరీక్షల విభాగం ప్రస్తుతానికి తుఫాను కారణంగా వాయిదా వేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. కాగా ఈ విషయాలను తెలియచేస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెబ్‌సైట్‌లో రెండు వేర్వేరు నోటిఫికేషన్‌లను సైతం విడుదల చేసింది జాతీయ పరీక్షల విభాగం. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డిసెంబర్ 5 న అనగా ఆదివారం నిర్వహించాల్సిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (IIFT) మరియు UGC NET ప్రవేశ పరీక్షలను కూడా వాయిదా వేయడం జరిగిందని ప్రకటించారు.
విశాఖపట్నం,భువనేశ్వర్, విజయవాడ, సంబల్‌పూర్, కటక్, కోల్‌కతా మరియు దుర్గాపూర్ నగరాలకు IIFT ప్రవేశ పరీక్షను క్యాన్సిల్ చేశారు. అయా ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలలో ప్రవేశం పొందిన అభ్యర్థులకు పరీక్ష తేదీని తర్వాత ప్రకటిస్తామని కమిషన్ తెలిపింది. ప్రస్తుతం జువాద్ తుఫాన్ ప్రభావం కారణంగా ఈ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. మరి ఆగిపోయిన ఈ పరీక్షలను ఎపుడు జరపనున్నారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. కానీ ఎంతో కష్టపడి ప్రిపేర్ అయిన విద్యార్థులు సైతం హ్యాపీగా లేరని అర్ధమవుతోంది.