స్కూటీ నెంబర్ లో 'SEX' పదం.. చివరికి?

praveen
ద్విచక్ర వాహనం కొనుగోలు చేయాలని ఎంతో మంది ఆశ పడుతూ ఉంటారు. ఇక వాహన కొనుగోలు చేసిన తర్వాత హాయిగా ఆ వాహనంపై తిరగవచ్చు అని భావిస్తూ ఉంటారు. ఇక్కడ ఒక మహిళ ఇలాగే అనుకుంది. స్కూటీ కొనుక్కుంటే హాయిగా ఎక్కడికైనా వెళ్లొచ్చు అని భావించింది. కానీ స్కూటీ కొనుక్కున్న తర్వాత ఆమెకు అసలు సమస్య మొదలైంది. ఏకంగా తాను కొనుగోలు చేసిన స్కూటీ కి ఆర్టీఏ అధికారులు కేటాయించిన నెంబర్ ఆమెకు పెద్ద సమస్యను తెచ్చిపెట్టింది. దీంతో ఎవరు ఏమంటారో అని భయపడి చివరికి ఆ స్కూటీ మీద తిరగడం మానేసి ఆ యువతి. ఈ ఘటన ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది.

 ఢిల్లీకి చెందిన ప్రీతి అనే యువతి ఫ్యాషన్ డిజైనింగ్ చదువుతోంది. అయితే ఇక తన చదువును కొనసాగించడం కోసం ప్రతిరోజూ మెట్రో ద్వారా ప్రయాణిస్తూ ఉండేది.  మెట్రో ప్రయాణం ద్వారా ఎక్కువ సమయం వృధా అయ్యేది.. ఈ క్రమంలోనే స్కూటీ కావాలని అడగడంతో తల్లిదండ్రులు కొనిచ్చారు. అయితే స్కూటీ ద్వారా తనకు ప్రయాణ సమస్యలు తీరిపోతాయని భావించింది ఆ యువతి. కానీ స్కూటీ ద్వారా అసలు సమస్య మొదలైంది. ఇక అందరిలాగానే ఆ మహిళ కొనుగోలు చేసిన స్కూటీని ఆర్ టి ఓ ఆఫీస్ కి వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించింది. ఈ క్రమంలోనే ఆమె వాహనం నెంబర్ ప్లేట్ లో sex అనే పదం వచ్చింది.

 దీంతో సదరు మహిళ ఒక్కసారిగా షాక్ అయ్యింది.  అయితే ఇదే విషయంపై సదరు యువతి తండ్రి ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి నెంబర్ ప్లేట్ మార్చాలి అంటూ కోరాడు. కానీ అధికారులు మాత్రం కుదరదు అంటూ చెప్పేశారు . అయితే దేశ రాజధాని ఢిల్లీలో sex సిరీస్ నుంచి మొత్తం పది వేలు నెంబర్ ప్లేట్ కేటాయించామని అధికారులు తెలిపారు. ఇది పెద్ద విషయం కాదు అంటూ అధికారులు అన్నారు.. దీంతో ఆ యువతి చేసేదేమీ లేక sex అనే పేరు ఉన్న వాహనాన్ని తీసుకెళ్ల లేక చివరికి ఎప్పటిలాగానే మెట్రో లో ప్రయాణిస్తూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: