అధికార పార్టీలో కోవర్టులు.. చక్రం తిప్పుతున్న ఈటల..!

MOHAN BABU
 కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి కోవర్టుల భయం పట్టుకుంది. సొంత పార్టీలో నేతల కీలక సమయంలో మాట మారుస్తూ బేరసారాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుండడంతో నేతలను దారిలోకి తెచ్చుకునేందుకు అష్ట కష్టాలు పడుతున్నారని టాక్. హుజురాబాద్ ఉపఎన్నిక గెలుపు ఊపులో ఉన్నటువంటి ఈటల రాజేందర్  అధికార టీఆర్ఎస్ పార్టీకి మించి వ్యూహాలు రచిస్తున్నారు. ఎంపీటీసీ మరియు సర్పంచ్ ల బలం లేకున్నా తెరాస నేతల పైన కన్నేసి చక్రం తిప్పుతున్నారు. తెరాస రెబల్ అభ్యర్థిగా ఉన్నటువంటి రవీందర్ సింగ్ ను బరిలో దింపి ఈటల గేమ్ ఆడుతున్నారు.


 దీంతో అధికార పార్టీ నేతల్లో గుబుల్  మొదలైంది. ఈ ఎన్నికల్లో కూడా హుజురాబాద్ రిజల్ట్ వస్తుందా అని  ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జిల్లా మంత్రులతోపాటు స్థానిక ఎమ్మెల్యే లకు కూడా ఈ యొక్క గెలుపు బాధ్యతను సీఎం కేసీఆర్ అప్పగించారని, ఎలాగైనా ఓట్లను రాబట్టి సీఎం కేసీఆర్ గిఫ్ట్ గా బహుకరించాలని వారు చూస్తున్నారని తెలుస్తోంది. అయితే వీరి ఓట్లకు ఇప్పటినుంచి ఆఫర్లు ప్రకటించి వారికి పంపిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ వీరికి సొంత పార్టీలో ఉన్నటువంటి నేతలే మొండి చేయి చూపిస్తున్నట్టు స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారికంగా టిఆర్ఎస్ పార్టీ ఎంపిటిసిలు ఉన్నారు. రెబల్ అభ్యర్థి రవీందర్ సింగ్ వీరిని టార్గెట్ చేస్తున్నారు. మరోవైపు రవీందర్సింగ్ గెలుపు కొరకు ఈటెల రాజేందర్ చక్రం తిప్పుతున్నట్టు స్పష్టంగా కనబడుతోంది. టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారి జాబితాను తయారుచేసి ఏదో ఒక రూపంలో మంచి చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ఈటల రాజేందర్.

ఓటు మాత్రం రవీందర్ సింగ్ కు వేసి మిగతా ఓటును  వారికి ఇష్టం వచ్చిన వారికి వేయండి అని ఆఫర్ ప్రకటించినట్లు తెలుస్తోంది. అయితే దీనిని గమనించినటువంటి టిఆర్ఎస్ నేతలు ముందుగానే ఆ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు వారి కుటుంబ సభ్యులను కలిసి క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. వీరందరినీ తమ ఆధీనంలోనే ఉంచుకొని  ఎన్నికల తేదీ పోలింగ్ సమయానికి పోలింగ్ కు తీసుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇంత చేసినా వారి మనసులో మాత్రం ఏముందో అనే ఆందోళన మాత్రం ఆ పార్టీ నేతలను వెంటాడుతూనే ఉంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎంపీటీసీలు మెజారిటీ గా ఉండడం వారికి సరైన ప్రాధాన్యత తెరాస పార్టీలో దక్కకపోవడంతో వారు నిరాశతో ఉన్నట్లు తెలుస్తోంది. దీన్ని ఆసరాగా తీసుకున్నటువంటి ఈటల రాజేందర్ వీరందరినీ తన వైపు తిప్పుకునేల వ్యూహ రచన చేస్తున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: