ఆ రెడ్డి ఎమ్మెల్యేలే వైసీపీని మళ్ళీ నిలబెట్టాల్సింది..!

M N Amaleswara rao
అధికార వైసీపీలో ఏ సామాజికవర్గం నేతల హవా ఎక్కువగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టీడీపీలో కమ్మ, వైసీపీలో రెడ్డి సామాజికవర్గం నేతల హవా ఎక్కువగా ఉంటుందని అందరికీ తెలిసిందే. అందుకే ఆ రెండు పార్టీల్లో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు వాళ్లే ఉంటారు. టీడీపీలో కమ్మ, వైసీపీలో రెడ్డి ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారు. అయితే రెడ్డి ఎమ్మెల్యేల వల్లే వైసీపీ చాలావరకు నిలబడుతూ వస్తుంది.
గత రెండు ఎన్నికల ఫలితాలని చూసుకుంటే వైసీపీలో రెడ్డి ఎమ్మెల్యేలే ఎక్కువగా గెలుస్తున్నారు. గత ఎన్నికల్లో బీసీ, ఎస్సీ ఎమ్మెల్యేలు కూడా వైసీపీకి బాగా కలిసొచ్చారు. అయినా సరే వైసీపీకి కీలకంగా రెడ్డి ఎమ్మెల్యేలే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేలు నిలబడాలంటే రెడ్డి ఎమ్మెల్యేలే ముఖ్యమని చెప్పొచ్చు. ఎందుకంటే వారే దాదాపు ఐదు జిల్లాలని ప్రభావితం చేస్తున్నారు.
నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో రెడ్డి ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉంటారనే సంగతి తెలిసిందే. ఇటు గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా కొంతమేర ప్రభావం చూపుతారు. అంటే వచ్చే ఎన్నికల్లో ఆ రెడ్డి ఎమ్మెల్యేలే మళ్ళీ గెలిచి పార్టీని నిలబెట్టాల్సిన అవసరముంది. అసలు జిల్లాల వారీగా వైసీపీకి కీలకంగా ఉన్న రెడ్డి ఎమ్మెల్యేలని గమనిస్తే...గుంటూరులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆళ్ళ రామకృష్ణారెడ్డి, reddy GOPIREDDY' target='_blank' title='గోపిరెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్ రెడ్డిలు మెయిన్‌గా ఉన్నారు.
ఇటు ప్రకాశంలో బాలినేని శ్రీనివాసరెడ్డి, మానుగుంట మహీధర్ రెడ్డి, కే. నాగార్జున రెడ్డిలు కీలకం. అలాగే నెల్లూరులో మేకపాటి గౌతమ్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి' target='_blank' title='కోటంరెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి' target='_blank' title='శ్రీధర్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">శ్రీధర్ రెడ్డి, ఆనం రామ్ నారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిలు వైసీపీని గెలిపించాల్సి ఉంది.
చిత్తూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, బియ్యపు మధుసూదన్ రెడ్డి, రోజా, భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి...అనంతపురంలో అనంత వెంకట్రామి రెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి, వై.వెంట్రామిరెడ్డి, సిద్ధారెడ్డి, పెద్దారెడ్డి, ప్రకాశ్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి.....కర్నూలులో కాటసాని రామిరెడ్డి, కాటసాని రామ్ భూపాల్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి, శిల్పా రవికిషోర్ రెడ్డి, గంగుల బిజేంద్ర రెడ్డి, వై. బాలనాగిరెడ్డి, వై. సాయిప్రసాద్ రెడ్డి, బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి, చెన్నకేశవ రెడ్డి..కడపలో రవీంద్రా రెడ్డి, మల్లిఖార్జున్ రెడ్డి, శివప్రసాద్ రెడ్డి, రఘురామిరెడ్డి, సుధీర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డిలు ఉన్నారు. ఇక సీఎం జగన్‌ది కూడా కడప జిల్లా అనే సంగతి తెలిసిందే. ఈ రెడ్డి ఎమ్మెల్యేలు మళ్ళీ గెలిస్తే వైసీపీ మళ్ళీ అధికారంలోకి రావడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: