ప్రపంచంలోనే మొదటిది.. భారత రైల్వే రికార్డు?

praveen
ఈశాన్య రాష్ట్రాలు ఎన్నో దశాబ్దాల నుంచి అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉన్నాయి అని చెప్పాలి. ఇక అక్కడ ఎన్నికలు జరుగుతాయి. ప్రభుత్వాలు ప్రజల చేత ఎన్నుకోబడతాయ్. కానీ పాలకులు మారిన ఈశాన్య రాష్ట్రాల తీరు మాత్రం మారలేదు. ఇక ఏకంగా భారతదేశం నుంచి ఒక మూలకు విసిరి చేయబడిన రాష్ట్రాలుగా ఈశాన్య రాష్ట్రాలను అప్పట్లో ఎంతో మంది విశ్లేషకులు కూడా అభివర్ణించేవారు. అంతలా అభివృద్ధికి మౌలిక వసతులు అనే పదానికి దూరంగా ఉండేవి ఈశాన్య రాష్ట్రాలు. అక్కడి ప్రజలు కూడా తాము భారతీయులమేన అనే అనుమానంతో బ్రతికేవారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇలా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఈశాన్యరాష్ట్రాలలో కూడా గత కొంత కాలం నుంచి మాత్రం అభివృద్ధి పరుగులు పెడుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈశాన్య రాష్ట్రాల రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయి. భారతదేశంలో అంతర్భాగంగా ఉన్నప్పటికీ వివక్షకు గురైన రాష్ట్రాలుగా ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాలను మౌలిక వసతులు పెద్ద ఎత్తున కల్పిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇక అన్ని ప్రాంతాలలో కూడా రహదారుల అభివృద్ధి చేయడం విద్య ఉద్యోగం లాంటివి కూడా పెంచుతూ యువతకు ఉపాధి కల్పించడం లాంటివి చేస్తూ ఉన్నాయ్. అంతే కాదు ఇక ఈశాన్య రాష్ట్రాలలో ఎంతో మందికి సురక్షితమైన మంచినీరు కూడా అందిస్తూ ఉండటం గమనార్హం.

 ఇక ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలలో రైల్వే శాఖ ఒక అద్భుతమైన ప్రాజెక్టు మొదలు పెట్టింది అని తెలుస్తోంది. ఈశాన్య రాష్ట్రాలను కలిపే టువంటి ఒక రైల్వే లైన్ వేస్తుంది భారత రైల్వే శాఖ. మణిపూర్ లోని నోనీ వాలీ లో 141 మీటర్ల ఎత్తులో  రైల్వే బ్రిడ్జి నిర్మిస్తుంది భారత రైల్వే శాఖ. ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో నిర్మించబడుతున్న రైల్వే బ్రిడ్జి ఇదే కావడం గమనార్హం.  రైల్వే మార్గం పూర్తయితే 10 గంటలలో చేసే ప్రయాణం కేవలం రెండు గంటల్లో చేసే అవకాశం ఉందట. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ఎంతో కీలకంగా మారబోతుంది అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: