వైసీపీ కంచుకోట‌లో డ్యామ్ షూర్‌గా ఓడుతుందా...!

VUYYURU SUBHASH
ఏపీలో ఉన్న 175 నియోజకవర్గాల్లో కొన్ని జిల్లాల్లో ఉన్న... కొన్ని నియోజకవర్గాలు అధికార వైసీపీ కి ముందు నుంచి కంచుకోట‌లుగా ఉంటూ వస్తున్నాయి. రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాలో పలు నియోజకవర్గాల్లో వైసీపీకి తిరుగు లేని పరిస్థితి ఉంది. వైసిపి ఆవిర్భావం తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో ఆ నియోజకవర్గాల్లో ఆ పార్టీ జెండా ఎగిరింది. ఇలాంటి నియోజకవర్గాల్లో ప్రకాశం జిల్లాలోని కందుకూరు కూడా ఒకటి. 2012 నెల్లూరు పార్లమెంట్ కు జరిగిన ఉప ఎన్నికల్లో ఈ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి వైసీపీకి మెజార్టీ వచ్చింది. అప్పుడు ఇక్కడ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఎంపీగా ఉన్నారు.
ఆ తర్వాత 2014 - 2019 లో జరిగిన రెండు ఎన్నికల్లోనూ వైసీపీ నుంచి పోటీ చేసిన పోతుల రామారావు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే ఇప్పుడు కందుకూరు నియోజకవర్గం లో వైసిపి సీన్ పూర్తిగా రివర్స్ అయ్యేలా కనిపిస్తోంది. ఇక్కడి నుంచి గత ఎన్నికల్లో గెలిచిన మాజీ మంత్రి మహీధర్ రెడ్డి సొంత పార్టీ పైన తీవ్ర అసంతృప్తితో ఉంటున్నారు. ఈ నియోజకవర్గంలో టిడిపి ఇప్పటి వరకు కేవలం రెండుసార్లు మాత్రమే 1994 - 1999 ఎన్నికల్లో విజయం సాధించింది.
ఆ తర్వాత ఇక్కడ ఒక్కసారి కూడా టిడిపి గెలవలేదు. గతంలో కాంగ్రెస్ నుంచి ఇక్కడ వరకు విజయాలు సాధించిన మహీధర్ రెడ్డి ... గత ఎన్నికల్లో వైసీపీ లోకి వచ్చి విజయం సాధించారు. వ్యక్తిగతంగా మహీధర్ రెడ్డి కి మంచి పేరే ఉన్నా..  తాను ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండి కూడా ప్రజలకు ఏమీ చేయలేక పోతున్నాన‌న్న బాధ ఆయనలో ఉంది.
సీనియర్ ఎమ్మెల్యే గా ఉండి కూడా నియోజకవర్గంలో చిన్నచిన్న పనులు కూడా చేయలేని పరిస్థితి. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఆయ‌న త‌ప్పుకుంటే ఇక్క‌డ‌ వైసిపికి ఇక్కడ సీన్ లేదని అంటున్నారు. వైసీపీ కంచుకోటలో ఇప్పుడు ఆ పార్టీకి కష్టాలు తప్పేలా లేవు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: