గుడ్ న్యూస్ చెప్పిన సీఎం.. త్వరలోనే?

praveen
తెలంగాణలో ఎన్నో రోజుల నుంచి పెన్షనర్ల పిఆర్సి బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం జాప్యం చేస్తూనే వస్తుంది. అయితే అటు పెన్షనర్లు తమ బకాయిలను వెంటనే చెల్లించాలని పలుమార్లు ప్రభుత్వాన్ని కోరినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో వరుస ఎన్నికల నేపథ్యంలో ఈ విషయంపై ప్రభుత్వం ఎక్కడ స్పందించలేదు. అయితే ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్ల పిఆర్సి బకాయిల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.ఈ క్రమంలోనే అన్ని బకాయిలను కూడా  చెల్లించేందుకు సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం.

 అయితే ఈ ఏడాది కాకుండా వచ్చే ఏడాది దీనికి సంబంధించిన పిఆర్సి చెల్లింపులను జరపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు ఇటీవలే తెలంగాణ ఆర్థిక శాఖ జీవో జారీ చేయడం గమనార్హం. 36 సమాన వాయిదాలలో ఇక ఈ బకాయిలు చెల్లించేందుకు తెలంగాణ ఆర్థిక శాఖ నిర్ణయించింది. అయితే 2020 పిఆర్సి నాటికి రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ కూడా పెరుగుతుంది అన్న విషయం తెలిసిందే . కాగా గ్రాట్యూటీ ని 12 లక్షల నుంచి 16 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వీటిని పింఛన్దారులకు చెల్లించాల్సి ఉంటుంది..ఈ నేపథ్యంలోనే ఇటీవలే తెలంగాణ ఆర్థిక శాఖ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

 ఏప్రిల్ 1, 2020 నుంచి మార్చి 31 2021 వరకు ఉన్న అన్ని బకాయిలను కూడా 36 సమాన వాయిదాలలో చెల్లిస్తామని గతంలోనే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది ఎప్పుడు చెల్లిస్తారు అన్న దానిపై మాత్రం పూర్తి స్థాయి స్పష్టత ఇవ్వలేదు.  ఇక ఇప్పుడు ఇటీవలే తెలంగాణ ఆర్థిక శాఖ జారీ చేసిన జీవో ప్రకారం పింఛన్దారులకు పింఛను గ్రాట్యుటీ బకాయిలు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అందజేస్తానని తెలిపారు. 2020 ఏప్రిల్ 1వ తేదీన మరణించిన పింఛన్దారుల కుటుంబాలకు కూడా ఫిబ్రవరి 1 తర్వాత బకాయిలు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం ప్రభుత్వం తెలిపింది.  జనవరి పెన్షన్ సహ ఒక్కొక్క పింఛన్దారులకు 1.5 లక్షల నుంచి 3 లక్షల వరకు అదనంగాపింఛన్ లభించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Kcr

సంబంధిత వార్తలు: