వీరుకదా.. బాబూ విశ్వాస పాత్రులు...!

VUYYURU SUBHASH
ఆంధ్ర ప్రదేశ్ లో పొలిటికల్ హీట్ తారాస్దాయికి చేరింది. వైసీపీ టీడీపీ మధ్య మాటలు తూటాలు లా పేలుతున్నాయి. ఈ నేపధ్యంలో టీడీపీలో మారుతున్న ప‌రిణామాల నేప‌థ్యంలో ఎవ‌రు పార్టీ కోసం ప‌నిచేస్తున్నారు.?  పార్టీని ఎవ‌రు వాడు కుంటున్నారు? అనే విష‌యంపై చ‌ర్చ సాగుతోంది. ఎందుకంటే.. ఒక‌వైపు రెండున్న‌రేళ్లు పూర్తి చేసుకున్న నేప‌థ్యంలో వైసీపీ స‌ర్కారుపై స‌హ‌జంగానే వ్య‌తిరేక‌త మొద‌లైంది. ఈ ప‌రిస్థితి ఇటీవ‌ల జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లో స్ప‌ష్టంగా క‌నిపించింది. మ‌రి ఈ పెరిగిన వ్య‌తిరేక‌త ఏమైన‌ట్టు? ఎటు పోతున్న‌ట్టు? అనే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే పార్టీలో ఉంటూ.. పార్టీకి ప‌నిచేస్తున్న‌వారు?  పార్టీని వాడుకుంటున్న‌వారు ఎవ‌రనే అంశం కూడా ఆస‌క్తిగా మారింది.

ఉదాహ‌ర‌ణ‌కు.. పంచుమ‌ర్తి అనురాధ‌, బుద్దా వెంక‌న్న, వైవీబీ రాజేంద్ర‌ప్ర‌సాద్, వంటివారు..పార్టీ కోసం.. ఎంత‌కైనా తెగించే ప‌రిస్థితి ఉంది. వీరిలో కొంద‌రు ప్ర‌జాక్షేత్రంలో ప‌నిచేసిన వారు.. గెలిచిన వారు కూడా ఉన్నారు. పంచుమ‌ర్తి అనురాధ.. విజ‌య‌వాడ మేయ‌ర్‌గా కూడా చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది.. ఉన్నారు.

అయితే.. ఇప్పుడు.. వీరికి ఎక్క‌డా గుర్తింపు లేకుండా పోయింద‌నే ఆవేద‌న వారిలో క‌నిపిస్తోంది. కేవ‌లం ప్రెస్‌మీట్ల వ‌ర‌కే వీరు ప‌రిమిత‌మ‌వుతున్నార‌ని అంటున్నారు. ఎందుకంటే.. పైపైన ఆర్భాటం చేసి..అప్ప‌టిక‌ప్పుడు వ‌చ్చిన వారికి టికెట్లు.. మ‌ర్యాద‌లు ద‌క్కుతున్నాయి. వారు త‌మ ప‌నిచూసుకుని.. అవ‌స‌రం తీర‌గానే ప‌క్క‌కు త‌ప్పుకొని.. వ్యాపారాలు వ్య‌వ‌హారాల్లో మునిగిపోతు న్నారు.

కానీ, పార్టీ కోసం నిరంత‌రం వాయిస్ వినిపించే మ‌హిళానాయ‌కులు.. కొంద‌రు పురుష నాయ‌కుల ప‌రిస్థితి కూర‌లో క‌రివేపాకు మాదిరిగా ఉంద‌నే వాద‌న ఉంది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు వారు కూడా దూర మైనా.. లేక వాయిస్ త‌గ్గించినా.. పార్టీకి మ‌రింత చేటు త‌ప్ప‌ద‌నే సూచ‌న‌లు వ‌స్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికైనా.. ఇలాంటి వారిని ప్రోత్స‌హించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌తంలో వారి ప‌నితీరును బ‌ట్టి.. ఇప్ప‌టికైనా.. వారిని పార్టీలోను.. ప‌ద‌వుల్లోనూ.. ప్రోత్స‌హించ‌డం ద్వారా.. పార్టీని బ‌లోపేతం చేసుకునే అవ‌కాశం ఉంటుంద‌ని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: