అప్పటి వరకు మంత్రులు, ఎమ్మెల్యేలు.. అసెంబ్లీకి రాకండి.. జగన్ ఆదేశాలు?

praveen
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు ఎంతటి దారుణ పరిస్థితులు తీసుకు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.  కొన్ని జిల్లాల్లో అంటే అతి భారీ వర్షాలు కురవడం కారణంగా ఎంతో దారుణ పరిస్థితులు చోటుచేసుకున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో వచ్చిన వరదలతో జనజీవనం మొత్తం ఒక్కసారిగా అతలాకుతలం అయింది. ముఖ్యంగా నెల్లూరు  చిత్తూరు కడప అనంతపురం జిల్లాలో  భారీ వర్షాల కారణంగా ఎక్కడ చూసినా కూడా వరద నీరు నిలిచిపోయయింది. దీంతో వందల గ్రామాలు ఇక వరద ప్రవాహం లో చిక్కుకుని జలదిగ్బంధంలో కి వెళ్ళి పోయాయి అని చెప్పాలి.


 భారీ వర్షాల కారణంగా ప్రజలందరూ అల్లాడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవలే మంత్రులు ఎమ్మెల్యేలతో సమీక్ష సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాలకు చెందిన ఇన్చార్జి మంత్రులు ఆయా జిల్లాల మంత్రులు ఎమ్మెల్యేలు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను పరిరక్షించాలి అంటూ ఆదేశాలు జారీ చేసారూ. ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ బాధితులకు అండగా నిలవాలని ఆదేశాలు జారీ చేసారూ సీఎం జగన్.


 వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న సమస్యలను అధికారులకు దృష్టికి వచ్చి  వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలి అంటు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో వరద ప్రభావం మళ్ళీ తిరిగి సాధారణ పరిస్థితి నెలకొని వరకు కూడా వరద బాధితులకు మంత్రులు ఎమ్మెల్యేలు అండగా ఉండాలి అంటే ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్. అంతేకాకుండా వరద ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య సదుపాయాలు కూడా అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేసారూ. అయితే ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతాలు సాధారణ పరిస్థితులు వచ్చేంత వరకూ ఎమ్మెల్యేలు మంత్రులు అసెంబ్లీకి రాకపోయినా పర్వాలేదు అని సీఎం జగన్ చెప్పినట్లు తెలుస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: