వామ్మో.. బట్టల ధరలు పెరిగిపోతున్నాయి?

praveen
కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత ప్రతి ఒక్కరి సామాన్యుడి జీవితం రోజురోజుకు ఎంతో భారంగా మారి పోతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈ కరోనా వైరస్ లాక్‌డౌన్‌ తర్వాత అన్ని రకాల ధరలు పెరిగిపోయాయ్. అప్పటికే ఉపాధి దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్న సామాన్యుడికి పెరిగిన ధరలు జీవితాన్ని మరింత భారంగా మార్చేసాయి దీంతో రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలు ఇక పస్తులు ఉండాల్సిన పరిస్థితి. ఇప్పుడిప్పుడే పరిస్థితులు కోలుకుంటున్నాయి. కానీ అదే సమయంలో అటు ధరలు కూడా అంతకంతకూ పెరిగి పోతూ ఉండటం గమనార్హం.


 ఇప్పటికే నిత్యావసరాల ధరలు భారీగా పెరిగిపోయాయి అన్న విషయం తెలిసిందే. అదే సమయంలో వంట గ్యాస్ ధరలు కూడా అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఇక పెట్రోల్ ధరల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి మంట పెట్టకుండానే పెట్రోల్ ధరలు భగ్గుమంటు ఉండటం గమనార్హం. ఇలా అన్నిరకాల ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని చెప్పాలి. ఇక రానున్న రోజుల్లో మరిన్ని ధరలు కూడా పెరిగ పోతున్నాయి అన్నది అర్ధమవుతుంది.


 దుస్తులు, పాదరక్షలు ధరలు కూడా మరింతగా పెరగబోతున్నాయట. అయితే ప్రస్తుతం దుస్తులు పాదరక్షలు పై జిఎస్టి 5 శాతంగా ఉంది. కానీ రానున్న రోజుల్లో 5 శాతంగా ఉన్న జి.ఎస్.టి ని 12 శాతానికి పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పెంచిన ఈ కొత్త జిఎస్టి  జనవరి నెల నుంచి అమలులోకి రాబోతుందట. cbic ఈ పన్ను పెంపుకు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.. అంతే కాకుండా ఫ్యాబ్రిక్స్ పై 5 శాతంగా ఉన్న జిఎస్టి జనవరి నుంచి 12 శాతానికి పెరుగుతుంది.  అయితే ఈ పన్ను పెంపు ప్రతిపాదనను అటు ఇండియా వ్యతిరేకించడం గమనార్హం. ఒకవేళ జీఎస్టీ పెరిగితే అటూ దుస్తులు పాదరక్షల ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: