అసెంబ్లీ ఘటనపై స్పందన.. నారా రోహిత్ నిరసన?
ఇలాంటి సమయంలోనే అటు చంద్రబాబు కంటనీరు పెట్టుకోవడం మాత్రం సంచలనంగా మారిపోయింది. ఇక దీనిపై అటు టిడిపి నేతలు మాత్రమే కాదు నందమూరి, నారా కుటుంబాల సభ్యులు సైతం స్పందిస్తూ ఇక జగన్ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సినీనటుడు ఎమ్మెల్యే బాలకృష్ణ ఈ ఘటన పై స్పందిస్తూ జగన్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సైతం స్పందించి ఆడ వాళ్లను గౌరవించడం మన బాధ్యతఅంటూ జగన్ ప్రభుత్వానికి చురకలు అంటించాడు.
ఇక ఇప్పుడు నారా రోహిత్ కూడా అసెంబ్లీలో చంద్రబాబు ను ఉద్దేశించి వైసిపి చేసిన వ్యాఖ్యలకు నిరసన తెలిపారు. చిత్తూరు జిల్లాలోని తన అమ్మమ్మ సమాధి వద్ద నివాళులు అర్పించి నిరసన తెలిపారు హీరో నారా రోహిత్. తన పెద్దమ్మను కించపరుస్తూ మాట్లాడి చంద్రబాబును కంటతడి పెట్టించినటువంటి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు నారా రోహిత్. ఈ తరహా రాజకీయాలు ఏమాత్రం సరైనది కాదు అంటూ నారా రోహిత్ చెప్పుకొచ్చారు. ఇలా చంద్రబాబు పై చేసిన వ్యాఖ్యలు కాస్త రోజురోజుకు హాట్ టాపిక్ గా మారిపోతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది కూడా ఆసక్తికరంగా మారింది.