జగన్ బాబూలాట - ఆంధ్రప్రజా నోటా పెండ : ప్రజల కష్టాల్లో మీ నవ్వులేంది జగనోరు?

praveen
ఇటీవల ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ అసెంబ్లీ సమావేశాలలో ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏదైనా చర్చ జరుగుతుందేమో అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఎప్పటిలాగే అసెంబ్లీలో పాత సీన్ రిపీట్ అయ్యింది. ప్రతిపక్ష పార్టీపై అటు అధికార పక్షం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడం  జరిగింది అన్నది ప్రస్తుతం వినిపిస్తున్న మాట. అయితే ఇటీవలే తన భార్యను వ్యక్తిగతంగా దూషించారు అంటూ టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీలో కంటనీరు పట్టుకోవడం కాస్తా హాట్ టాపిక్ గా మారిపోయింది.


 అయితే తన భార్యను వ్యక్తిగతంగా దూషించడం పై బాధపడుతూ అసెంబ్లీ వేదికగా చంద్రబాబు మాట్లాడుతున్న సమయంలో ఇక పక్కనే ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి నవ్వడం పై మాత్రం ప్రస్తుతం టీడీపీ శ్రేణులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలను ఇబ్బందులను పెట్టి రాక్షసానందం కేవలం జగన్ కే చెల్లుతుంది అని అంటున్నారు టీడీపీ శ్రేణులు. ఓవైపు ప్రజలందరూ వరదల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోతూ హాహాకారాలు చేస్తూ ఉంటే.. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన సీఎం జగన్ ప్రతిపక్ష పార్టీలపై ప్రతాపం చూపుతూ నవ్వడం ఏంటి అంటూ టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు.


 ఓవైపు రాష్ట్రం  మొత్తం భారీ వర్షాలతో తడిసి ముద్దవుతుంది. ఇక ఎక్కడ చూసినా భారీగా వరద నీరు నిలిచి పోయాయి. ముఖ్యంగా కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో అయితే భారీగా వరదలు జనజీవనాన్ని స్తంభింపజేస్తూన్నాయి. దీంతో ప్రజలు ఇంటి నుంచి కాలు బయట పెట్టలేని పరిస్థితి  జనావాసాల్లోకి కూడా నీరు చేరి చేరిపోవడంతో ప్రజలు దుర్భర స్థితిని ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు అండగా ఉండాల్సిన సీఎం గారు అసెంబ్లీలో నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నారు  అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు ప్రస్తుతం టీడీపీ శ్రేణులు. జగన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: