ఆంధ్ర ప్రదేశ్ రా ష్ట్ర వ్యాప్తం గా అల్పపీడనం ప్రభావంతో కడప నగరంలో భారీ వర్షం పడుతోంది. రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తుంది భారీ వర్షం.. బుగ్గ వంక ప్రాజెక్ట్ భారీగా చేరుతోంది వరద నీరు. నాలుగు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసారు అధికారులు. బుగ్గ వంక పరివాహక ప్రాంతం ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. నగరంలోని ప్రధాన రహదారులన్నీ జలమయం. అంబెడ్కర్ సర్కిల్, ఎన్జీవో కాలనీ, అప్సర హాల్ రోడ్డు, జిల్లా కోర్టు రోడ్డు, ఐటీఐ కూడలి తో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు, వాహనదారులు. అటు తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో వాహన రాకపోకలు మొదలైనట్లు సమాచారం అందుతోంది.
విడతల వారిగా ఘాట్ రోడ్డు లో వాహనాలను అనుమతిస్తూన్నారు టిటిడి పాలక మండలి. రెండు గంటల పాటు తిరుమలకు….అటు తరువాత రెండు గంటల పాటు తిరుపతికి వాహనాలను అనుమతిస్తూన్నారు టిటిడి పాలక మండ లి. రోండోవ ఘాట్ రోడ్డులో పూర్తి కాలేదు మరమత్తు పనులు. హరిణి దాటిన తరువాత రోడ్డు కోతకు గురైవడంతో కో నసాగు తు న్నాయి మరమత్తు పనులు. అలాగే.. తిరుపతి లోని రేణిగుంట కడప జాతీయ రహదారి పై రాత్రి నుండి వాహన రాకపోకలు ఆపేసారు అధికారులు. రాకపోకలు పీలేరు మీదుగా కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు అధికారులు. రేణి గుంట కడప జాతీయ రహదారి శ్రీనివాసపురం వద్ద వరద ధాటికి కూలిపోయే స్థితిలో వుంది వంతెన. వంతెన మధ్యలో ఇరుక్కున్న లారీ రాత్రి కావడం తో సహాయచర్యాలలో జాప్యం జరుగుతోంది. పొద్దున నుండి వేగంగా చేపట్టాయి సహాయక చర్యలు. ఇక అటు ఇ వా ళ రే పు తిరు మల శ్రీ వారి దర్శనాలు రద్దు కానున్నాయి.