కుప్పంలో బాబు 30 ఏళ్ల కుప్పి గంతుల‌కు చెక్‌..!

VUYYURU SUBHASH
కుప్పంలో 30 ఏళ్ల గా అప్ర‌తిహ‌తంగా రాజ‌కీయం చేస్తూ వ‌స్తోన్న చంద్ర‌బాబుకు జ‌గ‌న్ మార్క్ చెక్ దాదాపు ఖాయం అయిపోయింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అక్క‌డ చంద్ర‌బాబు మ‌రోసారి పోటీ చేస్తే గెలిచే ప‌రిస్థితి అయితే క‌న‌ప‌డ‌డం లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్లూ ఆయన ఎప్పటికైనా వైయ్యస్సార్ కంచుకోట అయిన పులివెందులలో తెలుగుదేశం జెండా ఎగరాలని సంక‌ల్పంతో ఉండేవారు. అయితే బాబు అక్క‌డ వైఎస్ ఫ్యామిలీ ని ఏమాత్రం ట‌చ్ చేయ‌లేక‌పోయారు. పులివెందుల లో వైఎస్ ఫ్యామిలీని ఓడించేందుకు బాబు చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ లేదు.

ఈ క్ర‌మంలోనే సతీష్ రెడ్డి అనే వ్యక్తిని ఎమ్మెల్సీని చేసి పులివెందుల లో ని ఆరు మండ‌లాల‌కు ప్ర‌త్యేకంగా పార్టీ ఇన్‌చార్జ్‌ల‌ను పెట్టి మ‌రీ నానా యాగీ చేశారు. వైఎస్సార్ మ‌ర‌ణం త‌ర్వాత ఉప ఎన్నిక‌ల్లో వైఎస్ విజ‌య‌మ్మ పులివెందుల నుంచి పోటీ చేసి బారీ మెజార్టీ తో ఘ‌న‌విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత ఆయ‌న త‌న‌యుడు జ‌గ‌న్ ఇప్పుడు పులివెందుల‌ను ఆక్ర‌మించేశారు. గ‌త ఎన్నిక‌ల్లో అయితే ఏకంగా జ‌గ‌న్‌కు అక్క‌డ 90 వేల పైచిలుకు ఓట్ల భారీ మెజార్టీ వ‌చ్చింది.

అయితే ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అయిపోయింది. పులివెందుల‌లో వైఎస్ ఫ్యామిలీని ఢీ కొట్ట‌డం ఏమో గాని కుప్పంలో బాబు కూసాలు క‌దిలి పోతున్నాయి. కుప్పం కోట బీట‌లు వారిపోతోంది. కుప్పం మాత్ర‌మే కాదు.. కుప్పం ప‌క్క‌నే ఉన్న చంద్ర‌బాబు సొంత నియోజకవర్గం చంద్రగిరిలో కూడా ఎదురుదెబ్బలే. అస‌లు ఆ మాట‌కు వ‌స్తే చంద్ర‌గిరిలో టీడీపీ గెలిచింది చివ‌ర‌గా 1994లో మాత్ర‌మే. అది కూడా ఎన్టీఆర్ గాలిలో..!

ఇక తాజాగా జ‌రిగిన మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో కూడా టీడీపీ కి అక్క‌డ గెలిచే సీన్ లేద‌ని అంటున్నారు. ఓవ‌రాల్ గా చూస్తే మూడు ద‌శాబ్దా ల‌కు పైగా వ‌రుస‌గా ఏడు సార్లు ఓట‌మి లేకుండా గెలుస్తూ వ‌స్తోన్న చంద్ర‌బాబుకు తొలిసారి వ‌చ్చే ఎన్నిక‌ల్లో కుప్పంలో బ్రేకులు ప‌డ‌తాయంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: