వద్దన్నా వీడియో తీశాడు.. చివరికి జైలు పాలయ్యాడు?

praveen
ఇటీవలికాలంలో యూట్యూబ్ వాడే వారి సంఖ్య ఎంతలా పెరిగిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎలాంటి సమాచారం కావాలన్నా కూడా యూట్యూబ్ వేదికగా దొరుకుతూ ఉండటంతో ఎంతో మంది అన్ని విషయాలకు కూడా యూట్యూబ్ మీదే ఆధార పడి పోతూ ఉన్నారు. అదే సమయంలో ఇక ఇటీవల కాలంలో ఎంతో మందికి యూట్యూబ్ అనేది ఒక ఆదాయ వనరు గా మారిపోయింది. యూట్యూబ్ వేదికగా సరికొత్త కంటెంట్ అప్లోడ్ చేస్తూ ఎంతో మంది లక్షల్లో సంపాదిస్తున్న వారు కూడా ఉన్నారు. నేటి రోజుల్లో అయితే ఎప్పటికప్పుడు తమ ఫాలోవర్ లకు  సరికొత్త కంటెంట్ అందించడానికి యూట్యూబర్లు సరికొత్తగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇలా కొన్ని సార్లు యూట్యూబ్ లో చేసే చిత్రవిచిత్రమైన ప్రయత్నాలు చిక్కుల్లో పడేస్తూ  ఉంటాయి అన్నది ఇప్పటికే పలుమార్లు చూశాం.


 ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ఒక పవిత్రమైన ప్రాంతంలో  వీడియోలు తీయడానికి అస్సలు అనుమతి లేదు. అక్కడ ఎవరైనా వీడియోలు తీస్తే అక్కడి జనాలు మొత్తం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇలాంటి ఒక పవిత్రమైన ప్రదేశం లో యూట్యూబ్ వీడియోలు తీశాడు. దీంతో ఇక పండితులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చివరికి కటకటాలపాలయ్యాడు ఆ యూట్యూబర్. ఢిల్లీకి చెందిన గౌరవ శర్మ అనే వ్యక్తికి గౌరవ్ జోన్ అనే పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు. ఎప్పుడు వినూత్నమైన వీడియోలు తీసి నెటిజన్లను ఆకర్షించడంలో ముందు ఉంటాడు సదరు యువకుడు. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్ లో ఉన్న బృందావన్ ప్రాంతంలోని  నిధివన్ రాజ్ అనే అటవీ ప్రాంతంలో వీడియో తీయాలని భావించాడు. అయితే ఇక్కడ రాత్రులు శ్రీకృష్ణుడు ఆయన ప్రేయసి ఏకాంతంగా గడుపుతారు అని అక్కడి ప్రజలు నమ్మకం. అందుకే రాత్రులు ఆ ప్రదేశానికి ఎవరిని అనుమతించరు.


 దీంతో రాత్రి సమయంలో ఆ ప్రాంతంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని భావించాడు ఈ యూట్యూబర్. ఈ క్రమంలోనే ఎవరికీ తెలియకుండా నిధివన్ రాజ్ లోకి చొరబడి వీడియోలు తీశాడు. ఇక ఆ తర్వాత ఈ వీడియోని తన చానల్లో ప్రసారం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న పండితులు అతని పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రమైన ప్రాంతంలో అపచారానికి ఒడిగట్టాడు అని భావిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  ఈ యూట్యూబ్ నుంచి వీడియో  తొలగించినప్పటికీ కూడా పోలీసులు మాత్రం అతనిని అరెస్టు చేసి జైలుకు తరలించారు.  గతంలో కూడా ఈ యూట్యూబర్ పలుమార్లు ఇలా పలు కేసుల్లో  ఇరుక్కోవటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: