ప‌ద్మ‌శ్రీ అవార్డు రాక‌పోవ‌డానికి సోనుసూద్‌ స‌మాధానం ఏమిటంటే..?

N ANJANEYULU
భార‌తదేశంలో ఇటీవ‌ల ప్ర‌దానం చేసిన ప‌ద్మ అవార్డులు సంచ‌ల‌నం సృష్టించాయి. ముఖ్యంగా భార‌త్‌కు స్వాతంత్య్రం 2014లోనే వ‌చ్చిన‌ద‌ని కంగ‌న‌ర‌నౌత్ వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌టంతో వాటిపై మ‌రింత దుమారం రేగిన‌ది. ఆమెకు ఇచ్చిన ప‌ద్మ అవార్డును సైతం వెన‌క్కు తీసుకోవాల‌ని ప‌లువురు డిమాండ్ కూడ చేసారు.  క‌రోనా స‌మ‌యంలో ఎంతో మంది పేద‌ల‌కు మేలు చేసి.. ఇప్ప‌టికీ సాయం కావాల‌నే వారికి త‌ప్ప‌కుండా స‌హాయం చేసే సోనూసూద్‌కు ప‌ద్మ‌శ్రీ అవార్డు ఎందుకు ఇవ్వ‌లేద‌ని ప‌లువురు అసంతృప్తి వ్య‌క్తం చేసారు. కంగ‌న పేరు క‌నీసం ప‌రిశీల‌న‌లో లేక‌పోయినా కానీ బీజేపీ ప్ర‌భుత్వం ఆమెకు ప‌ద్మ‌శ్రీ అవార్డును అంద‌జేసిన‌ది.
 
ప్ర‌భుత్వం మీకు అవార్డును ఎందుకు ఇవ్వ‌లేద‌ని ఓ మీడియా ప్ర‌తినిధి సోనూసూద్ ను ప్ర‌శ్నించాడు. దీనిపై ఆయ‌న నాకు అవార్డులు వ‌చ్చినా రాక‌పోయినా సామాజిక సేవా కార్య‌క్ర‌మాలు కొన‌సాగిస్తూనే ఉంటా. అవార్డులు, రివార్డుల గురించి నేను అస‌లు ఆలోచించ‌ను.  దాదాపు ఇప్ప‌టివ‌ర‌కు 22వేల మంది విద్యార్థుల‌కు సాయం చేశాన‌ని చెప్పారు. అదేవిధంగా స‌మ‌కాలీన రాజ‌కీయాల‌పై కూడ సోనూసూద్ స్పందించారు. ప‌ని చేసే స్వాతంత్య్రం ఎక్క‌డ ఉన్నా స‌రే నేను ఆ ప్లాట్‌ఫాంలో చేరుతాను అని ప్ర‌క‌టించారు. అదేవిధంగా అన్న‌ధాత‌ల‌కు ఎల్ల‌ప్ప‌డు నేను అనుకూలంగానే ఉంటాన‌ని, మ‌నం తిండి తింటున్నాం అంటే దానికి కార‌ణం వారే అని వివ‌రించారు.

ప్రస్తుత కేంద్రప్రభుత్వానికి సోనూసూద్ వ్యతిరేకంగా  ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.  కానీ తన సోదరి మాళవిక త్వ‌ర‌లో జ‌రిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నుంద‌ని ఆదివారం ప్ర‌క‌టించారు. ఆమె పార్టీలో చేరుతున్న‌ద‌నే విష‌యం మాత్రం చెప్ప‌లేదు. స‌రైన స‌మ‌యంలో ప్ర‌క‌టిస్తామ‌ని వెల్ల‌డించారు సోనూసూద్‌. మోగాలోని త‌న నివాసంలో నిర్వ‌హించిన విలేక‌ర్ల స‌మావేశంలో సోనూసూద్ త‌న సోద‌రి రాజ‌కీయం గురించి ప్ర‌స్తావించారు. మ‌రోవైపు ఆయ‌న సోద‌రి మాళ‌విక ఇటీవ‌లే పంజాబ్ సీఎం చ‌ర‌ణ్‌జీత్‌సింగ్ చ‌న్నిని క‌లిసారు. గ‌తంలో ఢిల్లీ సీఎం అర‌వింద్ క్రేజీవాల్‌తో కూడ భేటీ అయ్యారు ఆమె. ఢిల్లీ ప్ర‌భుత్వం చేప‌ట్టే దేశ్ కా మెంటార్స్ కార్య‌క్ర‌మానికి సోనూసూద్ బ్రాండ్ అంబాసిట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: