హమాలీ పని కోసం పోటీ పడుతున్న నిరుద్యోగులు.. కారణం..!

frame హమాలీ పని కోసం పోటీ పడుతున్న నిరుద్యోగులు.. కారణం..!

MOHAN BABU
 వృత్తి ఏదైనా ఆదాయ మార్గం మెండుగా ఉంటేనే ఆ కుటుంబం తద్వారా వ్యవస్థ, సమాజము ఆర్థికంగా బలపడుతుంది. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ కలిగిన భారతదేశంలో ప్రైవేటు పెట్టుబడిదారీ విధానం యొక్క ప్రభావం వల్ల, ప్రభుత్వాల ఉదాసీన వైఖరి వలన పేదరికం మరీ పెరిగిపోవడంతో అల్పాదాయ వర్గాల శాతo గణనీయంగా ఉంది. 73 శాతం సంపద కేవలం 1% ఉన్న సంపన్నవర్గాల చేతిలో ఉన్నది. అంటే 74 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం ఎటువైపు ప్రయాణం చేసిందో ఆలోచిస్తే తెలుస్తుంది.  40 శాతంగా ఉన్నటువంటి యువత భారత దేశములో దేశ అభివృద్ధిలో భాగస్వాములు కాకపోతే అటు దేశ ఆర్థిక పరిస్థితి తో పాటు కుటుంబాల పరిస్థితి కూడా దయ నీయంగానే ఉంటుంది .కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ ఉపాధి మార్గాలను గణనీయంగా పెంచి స్వావలంబన దిశగా యువతకు ఉపాధి కల్పించే గురుతర బాధ్యతలు ఎక్కడైతే తీసుకుంటారో ఆ  ప్రాంతము బలపడుతుంది. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ ఒక లక్షా తొంభై ఒక వేల ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఖాళీగా ఉండడం నిరుద్యోగుల సంఖ్య 40 లక్షలు దాటి పోయినట్టుగా కొన్ని గణాంకాలు చెబుతుంటే అనేక మంది యువకులు ఉద్యోగ అర్హత దాటిపోవడంతో పాటు ఉద్యోగాలు రావో ఏమోనని ఆవేదనతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు


 దినసరి కూలీలుగా, హమాలీలు గా ,తాపీ మేస్త్రీలు గా, రోడ్డుపైన నడుపుకునే చిల్లర వ్యాపారాల్లో నిమగ్నమై చాలీచాలని జీవితం గడుపుతున్నారు .ఇది దయనీయమైన పరిస్థితి. ఒక్క తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే నిరుద్యోగం, అల్పాదాయo, ఆకలిచావులు పరిమితం కాలేదు. కొంత ఎక్కువ తక్కువగా దేశ వ్యాప్తంగా ఈ దుస్థితి కొనసాగుతున్నది. దీనిని కట్టడి చేయాల్సిన టువంటి బాధ్యత ప్రభుత్వాలదే.


హమాలీ పని చేసుకోవాలన్న తెలంగాణ మంత్రి:

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య మీద

వాదోపవాదాలు చర్చలు జరిగిన సందర్భంలో ఖాళీలను భర్తీ చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసిన వేళ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి చేసిన ఒక వ్యాఖ్య పట్ల యువత ,నిరుద్యోగులు, మేధావులు, ప్రజాస్వామిక వాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ఆరు మాసాల క్రితం యువతకు ఉపాధి కల్పించాలంటే అందరికీ ఉద్యోగాలు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వం నుంచి సాధ్యం కాదని హమాలీ పని చేసుకుని బ్రతకాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్య రాష్ట్ర వ్యాప్తంగా దుమారాన్ని రేపింది.
   నిజంగానే వేలాదిమంది విద్యావంతులు నిరుద్యోగ యువత ఆదాయ మార్గం లేక హమాలీలు గా కూలీలుగా పని చేస్తున్నారు. బీటెక్, ఎంటెక్, ఎంబీఏ లాంటి పట్టాలను చేతిలో పట్టుకొని మరొకవైపు బస్తాలు మోసే కూలిపని చేస్తూ నికృష్ట జీవితాన్ని గడుపుతుంటే మంత్రి వ్యాఖ్యలు పుండు మీద కారం చల్లి నట్లు అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: