
ఏపీ లోకల్ వార్: టీడీపీ అభ్యర్థులకు కన్నీళ్లు ఒక్కటే తక్కువా...!
ఇక ఇందులో కమలాపురం నగర పంచాయతీ అయ్యాక జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవే కావడం విశేషం. అయితే ఈ నగర పంచాయతీ లో మొత్తం 20 వార్డులున్నాయి. ఈ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మేనమామ పి.రవీంద్రనాథరెడ్డి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఉన్నారు. జగన్ సొంత జిల్లా అంటే ఈ పాటికే మున్సిపాల్టీ ఏకగ్రీవం కావాలి. అయితే కమలాపురం టీడీపీ ఇన్‌చార్జి పుత్తా నరసింహారెడ్డి మొత్తం 20 వార్డులకు అభ్యర్థులను పోటీ లో పెట్టడం లో మాత్రం సక్సెస్ అయ్యారు. ఇదే అక్కడ టీడీపీకి చాలా ఎక్కువనే చెప్పాలి.
అయితే ఇప్పుడు అక్కడ పోటీ పెట్టి ఆయన చేతులు ఎత్తేశారట. దీంతో అక్కడ పోటీ లో ఉన్న అభ్యర్థులకు సాయం చేసే వారు లేక అరణ్య రోదనతో ఉన్నారట. పైగా పులివెందుల, ప్రొద్దుటూరు టీడీపీ ఇన్‌చార్జ్‌లు బీటెక్ రవి, ప్రవీణ్‌కుమార్‌ల కు ఇక్కడ బాధ్యతలు అప్పగించారు. అయితే వారు కూడా చేతి లో డబ్బులు విదల్చడం లేదట. దీంతో అక్కడ పోటీ చేస్తోన్న వారు దేవుడా డబ్బులు ఎలా రా బాబు అని తలలు పట్టుకుంటున్నారట. సాయినాథ్ శర్మ అనే వ్యక్తి మాత్రం ఉన్నంతలో అక్కడ క్యాండెట్ల కు సాయం చేసేందుకు తన వంతుగా కష్టపడుతున్నారట.