పెద్దిరెడ్డి చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు.. రాజ‌కీయం మారుతోందా...!

VUYYURU SUBHASH
ఏపీలో సీనియ‌ర్ మంత్రుల్లో ఒక‌రికి గా ఉన్న సీనియ‌ర్ వైసీపీ నేత‌, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బలమైన నేత. ఆయ‌న ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం పుంగ‌నూరు ను త‌న కంచుకోట‌గా మార్చేసుకున్నారు. అస‌లు ఇక్క‌డ స‌ర్పంచ్ ఎన్నిక‌లు, ఎంపీ టీసీ, జ‌డ్పీ టీసీల‌తో పాటు మున్సిప‌ల్ ఎన్నిక‌లు అన్ని కూడా ఏక‌గ్రీవం అయిపోయాయి. అస‌లు పుంగూరు లో గ‌త మూడు ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున బ‌ల‌మైన క్యాండెట్ ను కూడా చంద్ర‌బాబు పోటీ పెట్ట లేక‌పోయారు.

అయితే ఇప్పుడు పెద్ది రెడ్డి చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంను గ‌ట్టిగా టార్గెట్ చేశారు. దీంతో చంద్ర‌బాబు త‌న  కంచుకోట క‌దిలి పోతూ ఉండ‌డంతో ఇప్పుడు పెద్దిరెడ్డి సొంత నియోజ‌క‌వ‌ర్గం పుంగ‌నూరును టార్గెట్ చేస్తూ వ‌స్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పుంగ‌నూరు లో పెద్ది రెడ్డి ఎలా గెలుస్తారో ?  చూస్తానంటూ బాబు స‌వాల్  చేసే వ‌ర‌కు ప‌రిస్థితి వ‌చ్చింది. పెద్ది రెడ్డి పుంగ‌నూరు  నియోజ‌క‌వ‌ర్గంలో 2009 నుంచి హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసుకుంటూ తన సత్తాను చూపిస్తున్నారు. ఆయ‌న కేవ‌లం పుంగ‌నూరు లో మాత్ర‌మే కాకుండా.. చిత్తూరు జిల్లా మొత్తం ప్ర‌భావం చూపుతూ చంద్ర‌బాబుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు.

పెద్ది రెడ్డిని పుంగూరు లో కంట్రోల్ చేయ క పోతే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న త‌న కుప్పం సీటు  కే ఎస‌రు పెట్టేలా క‌నిపిస్తున్నారు. అందుకే ఇప్పుడు అక్క‌డ పెద్ది రెడ్డి దూకుడు కు బ్రేకులు వేసేందుకు చంద్ర‌బాబు చల్లా రామచంద్రారెడ్డిని ఇన్ ఛార్జిగా నియమించారు. దీంతో పాటు చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి అమ‌ర్ నాథ్ రెడ్డి తో పాటు మ‌రో ఇద్ద‌రు సీనియ‌ర్ నేత‌ల‌ను కూడా పుంగ‌నూరు లో పార్టీని స్ట్రాంగ్ చేసే బాధ్య‌త‌ను అప్ప‌గించారు. మరి వీరు పెద్దిరెడ్డి జోరుకు ఎలా ?  బ్రేకులు వేస్తారో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: