పబ్జి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. కొత్త గేమ్ వచ్చేసింది?
అన్ని పనులను వదిలేసి కేవలం పబ్జి ఆడటం పనిగా పెట్టుకునే వారు చాలామంది. ఇలా పబ్ జి గేమ్ కు బానిసలుగా మారిపోయి ప్రాణాలు కోల్పోయిన వారు కూడా చాలామంది ఉన్నారు. ఇక ఆ తర్వాత చైనాతో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఏకంగా పబ్జి ఆట పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో పబ్జి ఆడే ప్రతి ఒక్కరి గుండెల్లో బాంబు పేలినంత పని అయింది. ఇక పబ్జి నిషేధానికి గురైన కొన్ని రోజుల తర్వాత ఎంతోమంది పిచ్చివాళ్ళలా గా ప్రవర్తించడం కూడా మొదలుపెట్టారు. నిషేధానికి గురైన పబ్జి ఎప్పుడెప్పుడు మళ్ళీ ఇండియాలో ఎంట్రీ ఇస్తుందా అని ఎంతో ఆశగా ఎదురుచూశారు. అయితే పబ్జి లోటును తీర్చేందుకు ఆ తర్వాత ఎన్నో రకాల గేమ్స్ అందుబాటులోకి వచ్చినప్పటికీ ఏ గేమ్ కూడా పబ్జి లెవెల్ లో అందరిని ఆకర్షించే లేకపోయింది
అయితే నిషేధానికి గురైన పబ్జి తిరిగి మళ్ళీ వచ్చేసింది. పబ్జి న్యూ స్టేట్ పేరుతో అందుబాటులోకి వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా గురువారం విడుదలైన ఈ గేమ్ను 17 భాషల్లో డిజైన్ చేశారు. గూగుల్ ప్లే స్టోర్లో దీని సైజు 1.4 gb ఉంది. ఆండ్రాయిడ్ 6 ఆపై వెర్షన్లలో మాత్రమే ఈ గేమ్ ఆడటానికి వీలు ఉంటుంది అన్నది తెలుస్తుంది. అయితే పబ్జి ని భారత్లో నిషేధించిన తర్వాత క్రాఫ్టన్ సంస్థ బాటిల్ గ్రౌండ్స్ గేమ్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఇక పబ్జీ నుంచి కొత్త గేమ్ రావడం మాత్రం పబ్జి ప్లేయర్లు అందరికీ కూడా గొప్ప శుభవార్త అని చెప్పాలి.