ద్వారంపూడిని మళ్ళీ మెగా ఫ్యామిలీ సేవ్ చేయడం కష్టమే?
కానీ 2014 ఎన్నికల్లో పవన్ కల్యాణ్...టీడీపీకి బెనిఫిట్ చేశారు. ఆ పార్టీకి సపోర్ట్ ఇచ్చి అధికారంలోకి రావడానికి సాయం చేశారు. మళ్ళీ 2019 ఎన్నికల్లో ఊహిచని దెబ్బవేశారు. పవన్ నేతృత్వంలోని జనసేన విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి టీడీపీకి భారీగానే నష్టం జరిగింది. అలాగే వైసీపీకి బాగా లబ్ది జరిగింది. ఇక వీరి వల్ల టీడీపీకి నష్టం జరిగితే కొందరు నాయకులకు మాత్రం బాగా లాభం జరిగింది. అప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నవారికి...ఇప్పుడు వైసీపీలో ఉన్నవారికి బాగా ప్లస్ అయింది.
అలా అప్పుడు కాంగ్రెస్‌లో, ఇప్పుడు వైసీపీలో ఉండి బెనిఫిట్ పొందినవారిలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒకరని చెప్పొచ్చు. 2009 ఎన్నికల్లో ద్వారంపూడి కాంగ్రెస్ తరుపున కాకినాడ రూరల్ నుంచి పోటీ చేసి గెలిచారు. అప్పుడు ప్రజారాజ్యం, టీడీపీల మధ్య ఓట్లు చీలిపోయి ద్వారంపూడి విజయం సాధించారు.
2014 ఎన్నికల్లో పవన్..టీడీపీకి సపోర్ట్ చేయడంతో ద్వారంపూడి గెలుపు సాధ్యం కాలేదు. కానీ 2019 ఎన్నికల్లో జనసేన విడిగా పోటీ చేయడం వల్ల మళ్ళీ ఓట్లు చీలిపోయి టీడీపీకి నష్టం జరిగి...ద్వారంపూడి రెండోసారి ఎమ్మెల్యేగా గెలవడానికి ఉపయోగపడింది. ద్వారంపూడి టీడీపీపై 14 వేల మెజారిటీతో గెలిస్తే, జనసేనకు 30 వేల ఓట్లు పడ్డాయి. అంటే టీడీపీ జనసేనలు కలిస్తే ద్వారంపూడి పరిస్తితి ఏమయ్యేదో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఈ సారి పవన్..ద్వారంపూడికి ఆ ఛాన్స్ ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే ఆయన ఈసారి టీడీపీతో గెలిస్తే ద్వారంపూడికి చెక్ పడిపోతుంది.