ఇంత భారీ వర్షాలకు కారణం ఏమిటో తెలుసా?
ఈ పరిస్థితి వల్ల భూమి కాస్త ఊపిరి తీసుకుంది. ఢిల్లీ సహా 90 నగరాల్లో కొద్ది రోజుల పాటు కనీస స్థాయి కాలుష్యం కూడా నమోదు కాలేదని... దీంతో వాయు నాణ్యత ఎంతగానో మెరుగుపడిందని కొందరు వాతావరణ శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు. అయితే ఇంతగా కాలుష్యం తగ్గడంతోనే వాతావరణంలో మార్పులు జరిగి ప్రస్తుతం అధికంగా వర్షాలు పడుతున్నాయని కొందరి విశ్లేషకుల అభిప్రాయం. ఎన్నో వందల ఏళ్ల క్రితం ఇలా కాలాలకు సంబంధం లేకుండా వర్షాలు పడుతుండేవి. ఈ మధ్య ఇలాగే దేశంలో భారీ వర్షాలు నమోదు అయిన విషయం తెలిసిందే.
తగినంత వర్షాలు లేక అల్లాడుతున్న పర్యావరణానికి ఒక విధంగా లాక్ డౌన్ మంచి చేసిందని కొందరు అంటున్నారు. ప్రపంచ దేశాలలో కాలుష్యం తగ్గించి రానున్న తరాలకు స్వఛ్చమైన గాలిని, వాతావరణాన్ని అందించాలి అంటే కనీసం రెండు నెలలకు ఒకసారి అయినా లాక్ డౌన్ ను ప్రజలు ప్రభుత్వం పాటించేలా చేయాలి అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఆచరణలో సాధ్యపడకపోవచ్చు.