ఎవరైనా అడిగారా ? అంటూ రఘురామకృష్ణరాజు విమర్శలు..!
మరోవైపు కృష్ణపట్నం పోర్టులో వాటా అమ్మాలని బీజేపి నేతలు ఎవరైనా అడిగారా? అని ప్రశ్నించారు రఘురామకృష్ణరాజు.
పరిమల్ నత్వానీకీ రాజ్యసభ ఇవ్వాలని బీజేపీ నేతలు ఎవరైనా అడిగారా? అని నిలదీశారు. డిశ్చార్జి పిటీషన్ లను క్లియర్ చేసేందుకు సీబీఐ అధికారులు చొరవ తీసుకుంటుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. జగన్ కేసుల విచారణలో ట్రయల్ పూర్తి చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినట్టు చెప్పారు. గోయల్ ఐపీఎస్ అనే అధికారిని విజయ్ సాయి రెడ్డి తన పలుకుబడి ఉపయోగించి ఈడీ హైదరాబాద్ బ్రాంచ్ లో నియమించినట్టు చెప్పారు. ఈ ఈడీ అధికారితో జగన్ కేసులు తేలిపోతాయన్న అనుమానం తనకు కలుగుతుందన్నారు రఘురామకృష్ణ రాజు.
వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక ఆధారాలు సీబీఐ చేతికి లభ్యం అయ్యాయన్నారు రఘురామకృష్ణరాజు. నిజమైన నిందితులు త్వరగా దొరుకుతారని భావిస్తున్ననట్టు చెప్పారు. ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కూడా వ్యాట్ తగ్గించడం కుదరదని చెప్పినప్పుడు, పౌరసరఫరా శాఖా మంత్రి మాట్లాడడంలో ఆశ్చర్యం లేదన్నారు. అడిషనల్ అడ్వొకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి తన పరిధిని అతిక్రమించి మాట్లాడినందుకు బార్ అసోసియేషన్ నోటీసులు ఇచ్చినట్టు చెప్పారు.
మొత్తానికి రఘురామకృష్ణ రాజు జగన్ ప్రభుత్వంపై మాటల తూటాలు పేల్చుతూనే ఉన్నారు. ప్రతీ విషయంపై విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పట్ల తన వ్యతిరేక వైఖరిని బయటపెడుతున్నారు. చూద్దాం.. రఘురామకృష్ణ రాజు వ్యాఖ్యలు ఎంతవరకు దారితీస్తాయో..