సోము నోట.. హోదా మాట.. ఇంతకన్నా ఏం కామెడీ ఉంటుంది...!
అయితే.. అనూహ్యంగా ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నోటి నుంచి ప్రత్యేక హోదా ఇస్తామని.. ప్రకటించారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న బీజేపీ నాయకులు.. పెట్రోల్ ధరలపై వ్యాఖ్యలు చేస్తున్నారు. కేంద్రంలోని ప్రభు త్వం.. పెట్రోల్ చార్జీలను తగ్గించినా.. రాష్ట్రంలో జగన్ సర్కారు ఎందుకు తగ్గించడం లేదని.. రాష్ట్ర బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నా రు. ఇక, ఈ క్రమంలో వైసీపీ సర్కారు నుంచి కూడా ఇదే తరహాలో ఎదురు దాడి జరుగుతోంది.
ఈ క్రమంలో వైసీపీ నాయకుడు, పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి.. బీజేపీపై కామెంట్లు చేశారు. దీనికి కౌంటర్‌గా వ్యాఖ్యానించిన సోము.. నోరు జారారో. ఉద్దేశ పూర్వకంగా అన్నారో కానీ.. ఏపీకి హోదా ఇస్తామన్నారు. అయితే.. సోము అంత తేలికగా.. ఈ విషయాన్ని చెప్పలేదు. ఏపీకి ప్రత్యేక హోదా రావద్దని తాము కోరుకోవడం లేదని అన్నారు. అయితే.. ఏపీ ప్రజలు.. వైసీపీకి, టీడీపీకి ఓట్లు వేస్తూ.. కేంద్రంలో ఉన్న బీజేపీని హోదా అడిగితే ఎలా ఇస్తారని ప్రశ్నించారు. అంతేకాదు... ఇప్పటికే నిధులు ఇస్తూ.. కేంద్రం ఉదారంగా వ్యవహరిస్తోందని.. కేంద్రానికి ఏపీ ప్రజలు ఏం చేశారని.. ప్రశ్నించారు.
కేంద్రంలోని బీజేపీకి ఏపీ ప్రజల ఒక్క ఓటు అన్నా వేశారా ? కనీసం ఒక్క ఎంపీనన్నా గెలిపించారా? అయినప్పటికీ.. కేంద్రం ఎంతో ఉదారంగా ఏపీ ప్రజలకు నిధులు ఇస్తోందని.. చెప్పారు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీలేదని.. ఏపీలో ప్రజలు.. రాష్ట్రంలో బీజేపీకి ఓట్లు వేసి.. పార్టీని అదికారంలోకి తీసుకువచ్చిన మరుక్షణం.. తానే స్వయంగా కేంద్రం వద్దకు వెళ్లి హోదాపై ఒప్పించి తీసుకువస్తానని.. తేల్చి చెప్పారు. సో.. సోము వ్యాఖ్యల వెనుక ఉన్న రీజన్ ఇదేనన్నమాట! మరెందుకు ఆలస్యం.. హోదా కోరుకునేవారు కమలాన్ని కరుచుకుని ఓట్లు కుమ్మరించాల్సిందేనన్నమాట..