చిన్నారుల కరోనా టీకా.. ధర ఎంతో తెలుసా?

praveen
ప్రస్తుతం దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎంతో వేగంగా కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచ దేశాలు సైతం ఆశ్చర్యపోయే విధంగా ప్రస్తుతం భారత్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. భారత్లో టీకా ప్రక్రియ వేగం చూసి అగ్రరాజ్యాల సైతం ఆశ్చర్య పోతున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం అగ్రరాజ్యమైన అమెరికాతో పోల్చి చూస్తే దాదాపుగా మూడు రెట్ల కంటే ఎక్కువగానే భారత్లో వ్యాక్సినేషన్ పూర్తయింది. ఇక మొన్నటికి మొన్న ఏకంగా వంద కోట్ల వాక్సినేషన్ మార్క్ ను కూడా అందుకుంది భారత్. అయితే ప్రస్తుతం 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా టీకా అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం.


 ఇక కేంద్ర ప్రభుత్వం అందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు శరవేగంగా ప్రజలకు వ్యాక్సిన్ అందించే ప్రక్రియను కొనసాగిస్తున్నాయి అటు జనాలు కూడా వ్యాక్సిన్పై పూర్తి స్థాయి అవగాహన పెంచుకుని స్వచ్ఛందంగా టీకా వేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. అయితే ప్రస్తుతం చిన్నపిల్లల వ్యాక్సిన్ విషయంలో గత కొంత కాలం నుంచి పరిశోధనలు జరుగుతున్నాయి. ఇటీవలి కాలంలో పలు రకాల టీకాలు కూడా చిన్న పిల్లల కోసం అందుబాటులోకి వచ్చాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చిన్నారుల కోసం జోడాస్ కాడిలా రూపొందించిన  జైకోవ్ డి అనే కరోనా టీకాను త్వరలో కేంద్రం అందుబాటులోకి తీసుకు రాపోతున్నట్లు తెలుస్తోంది.



 అయితే కరోనా టీక ఒక్క డోస్ ధరను నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. ఒక్క డోస్ టీకా కోసం 265 రూపాయలు చెల్లించనున్నట్లు తెలుస్తోంది.. అయితే చిన్నారులకు అందించే ఈ టీకా ఎలాంటి ఇంజక్షన్ లేకుండానే పంపిణీ చేయనున్నారు. ఇక దీని కోసం ఒక ప్రత్యేక పరికరాన్ని వాడుతున్నారు. ఇక దీని ధర 93 రూపాయలు ఉంటుంది. ఇలా ఒక్కో డోస్ ధర 358 రూపాయలు అవుతుందని ఇక జోడస్ కాడిలా తెలిపింది.  దేశంలో పన్నెండేళ్ల వయసు పైబడినవారు అందరికీ కూడా ఇక ఈ టీకా వేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: