శివప్రసాద్ అల్లుడు మనసు ఆ సీటుపైనే ఉందా?
అంటే ఎక్కువసార్లు ఇక్కడ కుప్పంలో చంద్రబాబుకు వచ్చిన మెజారిటీతో చిత్తూరు పార్లమెంట్‌లో టీడీపీ గెలిచేస్తుంది. 2004, 2009, 2014 ఎన్నికల్లో చిత్తూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో మెజారిటీ స్థానాలు కాంగ్రెస్, వైసీపీనే గెలుచుకుంది. కానీ కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబుకు భారీ మెజారిటీ రావడం, అక్కడ ఎంపీకి కూడా ఎక్కువ ఓట్లు పడతాయి. అందుకే చిత్తూరులో టీడీపీ గెలిచేస్తుంది.
కానీ గత ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుకే భారీ మెజారిటీ రాలేదు. పైగా జగన్ గాలి ఉంది...దీంతో చిత్తూరు పార్లమెంట్‌లో టీడీపీ ఓడిపోవాల్సి వచ్చింది. 1996 తర్వాత టీడీపీ ఓడిపోయింది..2019 ఎన్నికల్లోనే. అయితే ఈ సారి జగన్ గాలి అంతగా ఉండేలా కనిపించడం లేదు. దీంతో చిత్తూరు పార్లమెంట్ సీటులో పోటీ చేస్తే సేఫ్‌గా గెలిచేయొచ్చని పలువురు టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఆ సీటు దక్కించుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారు.
ఇదే క్రమంలో 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ తరుపున గెలిచిన శివప్రసాద్ అల్లుడు నరసింహ ప్రసాద్..చిత్తూరు పార్లమెంట్ సీటు కోసం ట్రై చేస్తున్నారని తెలుస్తోంది. శివప్రసాద్...చంద్రబాబ్ బాల్య స్నేహితుడనే సంగతి తెలిసిందే. అలాగే సినీ యాక్టర్...ప్రత్యేక హోదా కోసం అనేక గెటప్‌లు వేసి పార్లమెంట్ దగ్గర హల్చల్ చేసిన నాయకుడు. అయితే శివప్రసాద్ 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అనారోగ్యంతో మరణించారు. దీంతో చిత్తూరు సీటు ఖాళీగా ఉంది...అటు శివప్రసాద్ అల్లుడు నరసింహ...రైల్వేకోడూరు ఇంచార్జ్‌గా ఉన్నారు. ఆ సీటులో గెలవడం కష్టం..అందుకే చిత్తూరు సీటుపై కన్నేసినట్లు తెలుస్తోంది.