పెట్రోల్ ధరలపై యుద్ధం ప్రకటించిన చంద్రబాబు..!
పెట్రోల్, డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించకపోవడంపై టీడీపీ అధినేత లోకేశ్ మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో పెట్రో ధఱలకోసం యానాం వెళ్లాలని జగన్ అన్నారని గుర్తు చేశారు. జగన్ పాలనలో ఏ రాష్ట్రం వెళ్లేందుకైనా సిద్ధమనీ.. మీరు సిద్ధమా..? వసూరెడ్డి అని ఘాటైన పదాలతో విరుచుకుపడ్డారు.
మరోవైపు జగన్ ప్రభుత్వం ఏపీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని మరోసారి తప్పుదోవ పట్టిస్తోందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. అసత్యాన్ని వాస్తవాలుగా ప్రచారం చేస్తోందన్నారు. పెట్రోలియం రంగం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు మొత్తం ఆదాయం 2కోట్ల 21లక్షల 56వేలని గుర్తు చేశారు. అబద్దాలు మాని వ్యాట్ తగ్గించాలని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
ఇక మోడీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పెట్రోల్ ధర 40రూపాయల వరకు పెరిగిందనీ.. చిత్తశుద్ధి ఉంటే ఆ మొత్తాన్నితగ్గించాలని సీపీఐ నేత నారాయణ డిమాండ్ చేశారు. పెట్రోల్ ధరల విషయంలో కేంద్రం వీధి నాటకాలు ఆడుతోందన్న నారాయణ..దసరా ఆఫర్ లా పదిరూపాయలు తగ్గించడమేంటని ప్రశ్నించారు.అలాగే రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై వైసీపీకి చిత్తశుధ్ధి ఉంటే కేంద్రాన్ని నిలదీయాలన్నారు.ఇక పెట్రోల్ ధరను 116రూపాయ వరకు ఎవరు తీసుకెళ్లారని ఏపీ మంత్రి పేర్నినాని ప్రశ్నించారు. పెట్రోల్ ధరలు పెంచిన వాళ్లే రోడ్లపై ధర్నాలు చేస్తారా..? అని మండిపడ్డారు. 70రూపాయలు ఉండాల్సిన పెట్రోల్ ధరను ఎక్కడికి తీసుకెళ్లారని.. ప్రజలకు ఏమీ గుర్తుండదని బీజేపీ నేతలు అనుకుంటున్నారా.. అని విమర్శించారు. ప్రజలపై జాలి, దయ లేకుండా పెట్రోల్ రేట్లను పెంచారని.. మరో 25రూపాయలుఅయినా.. కేంద్రం తగ్గించాలని నాని డిమాండ్ చేశారు.