ఆ జంపింగ్ ఎమ్మెల్యే ఫ్యూచర్ ఇంత గందరగోళమా...!
దీనికి రీజనేంటి? ఇదే ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. నిజానికి ఏదైనా కేసులు ఉండో..లేక భారీ ఎత్తున వ్యాపారాలు ఉండో.. వాటికి ప్రభుత్వం నుంచి ఆటంకాలు వస్తాయని అనుకున్న నాయకులు పార్టీ మారడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలా కొందరు మారారు కూడా. కానీ.. మద్దాలి విషయంలో కేవలం సామాజిక వర్గం ప్రభావంతోనే అంటే.. మనందరం ఒకే పార్టీలో ఉందాం.. అనే పిలుపుతోనే ఆయన వచ్చారని కొన్నాళ్లు ప్రచారం జరిగింది.
కానీ, వాస్తవం ఏంటంటే.. ఆయనకు మంత్రి పదవి లేదా.. తత్సమానమైన పదవిని ఇప్పిస్తాననే హామీతో తీసుకువచ్చారని.. గిరి వర్గం చెబుతోంది. అయితే.. ఇప్పటికీ.. దీనిపై క్లారిటీ లేకపోవడం.. మంత్రివర్గం ఆశలు కూడా ఎక్కడా కనిపించకపోవడంతో మద్దాలి గిరికి, మంత్రి వెలంపల్లికి గతంలో ఉన్న సంబంధాలు అయితే.. ఇప్పుడు కనిపించడం లేదనేది వాస్తవం. గతంలో ఇద్దరూ కలిసి మెలిసి కార్యక్రమాలుచేసేవారు.కానీ, ఇటీవల కాలంలో ఆయన దూరంగా ఉంటున్నారు. మంత్రి పాల్గొంటున్న కార్యక్రమాల్లో కనిపించడం లేదు.
దీంతో వచ్చే ఎన్నికల నాటికి ఆయన పార్టీలో ఉంటారా? తిరిగి అయిందేదో అయింది.. తిరిగి వచ్చేయమంటే టీడీపీలోకి వెళ్లిపోతారా? అనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే.. పశ్చిమ ఓటర్లలో ఎక్కువ మంది ఇటీవల జరిగిన స్తానిక ఎన్నికల్లోనూ టీడీపీకే ఎక్కువ గా ఓట్లేశారు. సో.. ఈ పరిణామాల నేపథ్యంలో మద్దాలి గిరి ఏం చేస్తారనే చర్చ జోరుగా సాగుతోంది.