భారీ సభలను స్టేడియంలలో కానీ పెద్ద ఫంక్షన్ హాల్స్ లో కానీ ఖాళీ మైదానంలో కానీ ఏర్పాటు చేస్తే పెద్దగా వ్యతిరేకత రాదు. కానీ పంట పొలాలని కూడా చూడకుండా సౌకర్యం ఉందని ఒకే ప్రాంతంలో పెద్ద మొత్తంలో స్థలం కావాలి కనుక రైతుల అభీష్టానికి వ్యతిరేకంగా దైర్యంగా స్థలాన్ని చదును చేయడం దారుణం. ఇటీవలికాలంలో ఆదివాసీలకు సంబంధించినటువంటి భూములు, ప్రజలు పొందిన అసైన్డ్ భూములు హరితహారం ఇతరత్రా అవసరాల కోసం ప్రభుత్వం బలవంతంగా సేకరిస్తున్న నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో ఆదివాసీలు ప్రతిఘటించిన సందర్భాలు ఉన్నాయి. భూముల ధరలు విపరీతంగా పెరగడం, వ్యవసాయం యొక్క ప్రాధాన్యతను రైతులు ఎక్కువగా గుర్తించి అమలు చేయడం వంటి అనేక కారణాల వలన విశాల భూభాగం లో ఖాళీ స్థలాలు లేకపోవడమనేది పెద్ద సమస్యగా మారింది.
రాజకీయ పార్టీలకు. మరీ ముఖ్యంగా
తెరాస పార్టీ లక్షలాది జనంతో సభలు నిర్వహించి తమ ఆధిపత్యాన్ని చూపించుకోవడం ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటినుండి లక్షలాది మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం తద్వారా కొన్ని అనర్థాలు జరగడం మనం చూసి ఉన్నాం. స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో ఆ తర్వాత రెండు మూడు దశాబ్దాల వరకు భారీ ప్రాజెక్టులు నిర్మించినప్పటికీ దాని వలన రైతుల యొక్క విశాల భూభాగం కోల్పోవలసి రావడంతో అంతేకాక భవిష్యత్తులో పెను ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉన్నందున క్రమంగా భారీ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రభుత్వాలు తగ్గించి వేసినవి.
చెక్ డ్యామ్ ల వంటి నిర్మాణాలను పెంచి ఉన్న చిన్న
నీటి వనరులు అయిన కుంటలు చెరువులను కాపాడుకోవడానికి ప్రభుత్వాలు ఎక్కువగా కృషి చేస్తున్నాయి. అలాగే భారీ బహిరంగ సభ ల వలన జరిగే కొన్ని అనర్థాలను గతంలో జరిగిన కొన్ని సంఘటనలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు వెంటనే భారీ బహిరంగ సభల నిషేధించాలి. ముఖ్యంగా
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న
తెరాస పార్టీ అనేక సార్లు ఇలాంటి సమావేశాలు నిర్వహించి తన సత్తాను చాటుకున్న ప్పటికీ ప్రజల అభిమానాన్ని ప్రజల విశ్వాసాన్ని పొంద లేకపోవడంతో భారీ బహిరంగ సభకు
చెక్ పెట్టవలసిన అవసరం ఉంది.