యాత్రకు నాలుగేళ్లు: అంతా జగన్ కి అయినవాళ్లు
పాదయాత్ర సమయంలో జగన్ కూడా ప్రజలతో మమేకమయ్యేవారు. అవ్వా, తాతా బాగున్నావా అంటూ ప్రేమగా పలకరించేవారు. ఒక మనవడిలా మారి భరోసా కల్పించారు. వారి కష్టాలను చిరునవ్వుతో వింటూనే, పరిష్కరిస్తానని ధైర్యం చెప్పేవారు. ఇలా భరోసా కల్పిస్తూ సొంత మనిషిలా మారి పోయారు జగన్. పాదయాత్ర సమయంలో ఎంతో మంది కష్టాలను, కన్నీటిని తుడుస్తూ ముందుకు కదిలారు. కష్టాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలను ఓ అన్నగా మారి ఓదార్చేవారు. తమ ప్రభుత్వం వస్తుందని, అన్ని కష్టాలు తీరుస్తానని నమ్మకం కలిగించారు. అందుకే జగన్ కు ప్రజలంతా అయినవాళ్లుగా మారారు. చిన్నారులు, విద్యార్థులు, యువతీ యువకులు కూడా జగన్ ను సొంతమనిషిలాగానే భావించారు. ప్రతీ అడుగులో అడుగువేసి నడిపించారు.
ప్రజలు అభిమానం, నమ్మకం సంపాదించడం అంత సులువైన పనేమీ కాదు. ఎంతోమంది రాజకీయ నాయకులను ప్రజలు చూశారు. ఓటేశారు. కానీ జగన్ ను మాత్రం రాజకీయనేతగా ప్రజలు భావించలేదు. తమలో ఒకడిగా.. తమ కుటుంబ సభ్యుడిగానే భావించారు. అందుకే చాలామంది పాదయాత్రలో రాజకీయాలకతీతంగా కలిసి నడిచారు. జగన్ కూడా ప్రజలను ఎప్పుడూ ఓటర్లుగా చూడలేదు. అన్నా,అక్కా, అవ్వా, తాతా అంటూనే పలకరించారు. ప్రేమను పంచారు. అందుకే జగన్ ను వారు కూడా గుండెల్లో పెట్టుకున్నారు. సొంతమనిషిలా ప్రేమించి, రాష్ట్ర ముఖ్యమంత్రిని చేశారు.