విజయసాయి...అలా చేస్తే ముందు వైసీపీకే తలనొప్పిగా...!
టీడీపీ నేత పట్టాభి మాట్లాడిన ఒక మాట ఇంకా రచ్చ లేపిన విషయం తెలిసిందే. ఆయన ఏమని తిట్టాడు...ఎవరిని తిట్టాడు...దాని అర్ధం ఏంటి అనేది ఎవరికి క్లారిటీ లేదు. కానీ అది జగన్నే తిట్టారని, దానికి ఒక అర్ధం చెప్పుకుని మరీ వైసీపీ నేతలు....చంద్రబాబుని నానా బూతులు తిడుతున్నారు. ఈ బూతుల పంచాంగం రాష్ట్రానికే పరిమితం చేయకుండా, ఢిల్లీ స్థాయికి తీసుకెళ్లారు.
ఇప్పటికే వైసీపీ అరాచకాలు సృష్టిస్తుందని, టీడీపీ ఆఫీసులపై దాడులు చేసిందని, వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా బూతులు మాట్లాడుతున్నారని చెప్పి, చంద్రబాబు ఇటీవలే రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేశారు. ఇక టీడీపీ వాళ్ళు ఆ పనిచేస్తే అధికారంలో ఉన్న వైసీపీ నేతలు ఎందుకు ఆగుతారు. వాళ్ళు టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అలాగే రాష్ట్రపతిని కలిశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న సీఎంని తిట్టారని చెప్పారు..చంద్రబాబు, లోకేష్, పట్టాభిలు బూతులు మాట్లాడుతున్నారని అన్నారు.
ఇక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండే వ్యక్తులని తిట్టే వారిపై చర్యలు తీసుకునేలా చట్టాలు తీసుకురావాలని విజయసాయి...రాష్ట్రపతిని కోరారు. సరే ఇక్కడ వరకు బాగానే ఉంది..అలా అంటే వైసీపీ నేతలు ఎన్నిరకాలుగా టీడీపీ నేతలని తిట్టారు. సరే ఆ విషయం వదిలేస్తే...చంద్రబాబుని ఎన్ని బూతులు తిట్టారు. ప్రతిపక్ష నాయకుడు పదవి కూడా రాజ్యాంగబద్ధమైన పదవే. అంటే అలాంటి చట్టం ఒకటి వస్తే ముందు బుక్ అయ్యేది వైసీపీ నేతలే అని టీడీపీ శ్రేణులు కౌంటర్లు ఇస్తున్నాయి.