కేసీఆర్ VS ఈటల: అతి విశ్వాసమే తెరాస కొంప ముంచిందా?
ప్రస్తుతం సమాచారం ప్రకారం చూస్తే ఈటెల స్వల్ప ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు. అంతే కాకుండా దాదాపు పోలింగ్ కేంద్రం నుండి తెలుస్తున్న విషయం కూడా తెరాస శ్రేణులకు షాక్ ఇచ్చేలా ఉన్నాయి. ఆధిక్యం తక్కువా ఎక్కువ అని కాకుండా తెరాస పై బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుస్తాడు అనేది ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే తెలంగాణ లో రాజకీయం సరికొత్త మలుపులు తీసుకుంటుంది. అయితే ఈ ఓటమికి ఖచ్చితంగా తెరాస అవలంబించిన అతి విశ్వాసమే కారణం అని పక్కాగా చెప్పుకుంటారు తెలంగాణ ప్రజలు.
మా దగ్గర డబ్బుంది, ప్రజలకు పధకాలు ఇచ్చేసి ఓట్లు కొనేస్తాం అంటే కుదరదు అని ప్రజలు ముఖం మీదనే చెప్పే రోజులు వచ్చినట్లు ఉన్నాయి. మరి ఈ ఓటమితో తెరాసలో భారీ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉండేలా కనిపిస్తోంది. అయితే దీనిపై తెరాస అధినేత మరియు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమి మాట్లాడుతారో తెలియాల్సి ఉంది. ఈ ఓటమితో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని చెప్పాలి.