నిన్న హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ విజయవంతంగా పూర్తి అయిన సంగతి మనందరికీ విధితమే. అయితే హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక.. పోలింగు లో కొన్ని చిన్న చిన్న సంఘటనలు మినహా... విజయవంతంగా పోలింగ్ జరిగింది. ముఖ్యంగా ఎన్నడూ లేని విధంగా... హుజూరాబాద్ నియోజకవర్గం లో పోలింగ్ శాతం విపరీతంగా పెరిగింది. గత నాలుగు నెలలుగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన... కాంగ్రెస్, బిజెపి పార్టీ మరియు అధికార టీఆర్ఎస్ పార్టీలు... హుజరాబాద్ నియోజకవర్గంలో జోరుగా ప్రచారం చేసిన విషయం మనంద రి కీ విధితమే.
ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలే కాకుండా పక్కన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా.. హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక పై ఫోకస్ చేశారు. అయితే నిన్న ఈ ఉప ఎన్నిక పోలింగ్ పూర్తికాగా... పోలింగ్ అయిన గంటసేపటి ఎగ్జిట్ పోల్స్ కూడా వెలువడ్డాయి. అయితే ఇందులో బిజెపి పార్టీ మరియు అధికార టీఆర్ఎస్ పార్టీలు పోటాపోటీగా తలపడ్డాయి. ఎవరు గెలుస్తారనే దానిపై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. మొత్తానికి అధికార టీఆర్ఎస్ పార్టీకి 45 శాతం ఓట్లు అలాగే... భారతీయ జనతా పార్టీకి కూడా అదే శాతం ఓట్లు పోలైన ఓట్లు ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి.
అయితే ... ఎగ్జిట్ పోల్స్ లో... కాంగ్రెస్ పార్టీ.. శాతం చాలా పడిపోయింది. కేవలం ఏడు శాతం మాత్రమే కాంగ్రెస్ పొందడం గమనార్హం. దీంతో తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై తీవ్ర ఒత్తిడి పడినట్లు సమాచారం అందుతోంది. అంతేకాదు ఈ ఓటింగ్ శాతం కారణంగా ఆయన పదవికి కూడా గండం వాటిల్లే అవకాశం ఉన్నట్లు అర్థమవుతోంది. అయితే దీనిపై క్లారిటీ రావాలంటే నవంబర్ 2వ తేదీ వరకు మనం ఆగాల్సి ఉంటుంది.