చంద్ర‌బాబు రాంగ్ స్టెప్‌.. అన‌వ‌స‌రంగా తొంద‌ర ప‌డ్డారా ?

VUYYURU SUBHASH
టీడీపీ అధినేత , మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పం పర్యటన విషయంలో తొందరపడ్డారా ? అంటే అవుననే అంటున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు.  టీడీపీ అధినేత  చంద్ర‌బాబు  అనవసరంగా కుప్పం మున్సిపల్ ఎన్నికల ప్ర‌చారానికి ముందుగా వెళ్లారా ?  రేపు ఎన్నిక‌ల్లో రిజ‌ల్ట్ తేడా కొడితే అది అంతిమంగా ఆయ‌న ప‌రువు మ‌రింత తీసేస్తుందా ? అంటే అవున‌నే రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల్లోనే చంద్ర‌బాబు కుప్పం లో చావు త‌ప్పి క‌న్ను లొట్ట‌బోయిన చందంగా కేవ‌లం 30 వేల ఓట్ల మెజార్టీ తో విజ‌యం సాధించారు.

చంద్ర‌బాబు రేంజ్‌కు ఆ మెజార్టీ చాలా చాలా త‌క్కువ‌. ఇంకా చెప్పాలంటే చంద్ర‌బాబు అక్క డ ఓడిపోయి న‌ట్టే అనుకోవాలి. కుప్పంలో చంద్ర‌బాబు 1989 నుంచి ఓట‌మి లేకుండా వ‌రుస‌గా విజ‌యాలు సాధిస్తూ వ‌స్తున్నారు. అంటే 32 సంవ‌త్స‌రాలుగా కుప్పం చంద్ర‌బాబుకు కంచుకోట‌గానే ఉంటోంది. ఈ త‌రం యువ ఓట‌ర్లు అంతా ఆయ‌న ప‌ట్ల ఆస‌క్తి తో లేరు. అందుకే ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లో అక్క‌డ ఎదురు దెబ్బ తిన్నారు.

ఇక స‌ర్పంచ్ ఎన్నిక‌లు, ఎంపీటీసీ ఎన్నిక‌ల‌తో పాటు జ‌డ్పీ టీసీల్లో టీడీపీ చిత్తు చిత్తు గా ఓడిపోయింది. అయితే ఇప్పుడు మున్సిపాల్టీ కూడా పోతే బాబు ప‌రువు మ‌రింత పోతుంది. అందుకే అక్క‌డ పార్టీ కేడ‌ర్ లో జోష్ నింపేందుకు బాబు ముందుగానే ప్ర‌చారం చేస్తున్నారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో టీడీపీని గెలిపించాల‌ని ఇంటింటి ప్ర‌చారం చేస్తున్నారు.

ఇలాంటి ప‌రిస్థితుల్లో కూడా రేపు అక్క‌డ టీడీపీ ఓడిపోతే బాబు గారి ఇమేజ్ మ‌రింత డ్యామేజ్ అవ్వ‌డం ఖాయం. అందుకే ఇప్పుడు ఏపీ పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ లో చంద్ర‌బాబు కుప్పం ప్ర‌చారానికి ముందుగా వెళ్లి త‌న ప‌త‌నానికి తానే రిబ్బ‌న్ క‌ట్ చేసుకున్నార‌ని చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: