జ‌గ‌న్‌ అంతులేని డేరింగ్‌కు రీజ‌నేంటి.. తెలంగాణ‌లోనూ చ‌ర్చ‌..!

VUYYURU SUBHASH
వైసీపీ నాయ‌కులు.. జ‌గ‌న్ ప్ర‌భుత్వ జోరు.. వంటివి పొరుగు రాష్ట్రంలోనూ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ``ఏం దూకుడు.. ఏం దూకుడు..`` అంటూ.. నాయ‌కులు.. పార్టీలు కూడా చ‌ర్చించుకుంటున్నాయి. అదేస‌మ యంలో ప్ర‌జ‌లు కూడా ముఖ్యంగా రెండు రాష్ట్రాల స‌రిహ‌ద్దు ప్ర‌జ‌లు ఏపీ గురించి.. చ‌ర్చిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే తెలంగాణ‌లోని కొన్ని పార్టీలు.. ఏపీపై విమ‌ర్శ‌లు చేస్తున్నాయ‌ని అంటున్నారు. సాధార‌ణంగా.. రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయినా.. ఇరు ప్రాంతాల ప్ర‌జ‌లు, రాజకీయ నేత‌లు.. మాత్రం త‌ర‌చుగా.. ఇక్క‌డ ఏం జ‌రుగుతోంది? అని చూసుకుంటూనే ఉన్నారు.

ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ గెలుస్తుందా?  లేదా..? అనే విష‌యం ఇటీవ‌ల కాలంలో చ‌ర్చ‌నీ యాంశంగా మారింది. గ‌తంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీ ఆరోపించిన‌ట్టు.. పొరుగు రాష్ట్రాల స‌హ‌కారం జ‌గ‌న్‌కు వైసీపీకి ఉంద‌ని అంటారు. కానీ, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ త‌ర‌హా ప‌రిస్థితి ఉండే అవ‌కాశం లేదు. నిజానికి గ‌త ఎన్నిక‌ల‌కు ముందు తెలంగాణ‌లోని కొన్ని పార్టీలు.. ఏపీలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏర్ప‌డాల‌ని కోరుకున్నాయి. కానీ, ఇప్పుడు.. మాత్రం ప‌రిస్థితి భిన్నంగా ఉంద‌ని అంటున్నారు. అయితే.. ఎలాంటి ప‌రిస్థితి ఉన్నా.. ఎవ‌రు స‌హ‌క‌రించ‌క‌పోయినా.. వైసీపీకి తిరుగులేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

దీనికి కార‌ణం.. జ‌గ‌న్‌పై ప్ర‌జ‌ల‌కు ఉన్న విశ్వాసం.. ఆయ‌న అమ‌లు చేస్తున్న సంక్షేమ కార్య‌క్ర‌మాలు.. ఏ స‌మ‌స్య వ‌చ్చినా.. క్ష‌ణాల్లో స‌హ‌క‌రిస్తున్న తీరు.. ఇలా అనేక రూపాల్లో జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో భరోసా ఏర్ప‌డింది. అప్పులు చేస్తున్నార‌ని.. రాష్ట్రాన్ని నాశ‌నం చేస్తున్నార‌ని.. అంటున్న ప్ర‌త్య‌ర్థి పార్టీల నేత‌ల‌కు ప్ర‌జ‌లు స‌రైన రీతిలో స‌మాధానం చెబుతున్నారు. ఎవ‌రు మాత్రం త‌క్కువ‌.? ఎవ‌రు మాత్రం అప్పులు చేయ‌లేదు? క‌నీసం.. ఇప్పుడు అప్పులు చేసినా.. పేద‌ల‌కు ఇస్తున్నారు?  గ‌తంలో ఎంత మంది పేద‌ల‌కు ప‌ట్టుమ‌ని రూ.10 వేలు ఇచ్చారు? అని ప్ర‌శ్నిస్తున్నారు.

అదేవిధంగా.. కేంద్రంతో సంబంధాల విష‌యంలోనూ.. జ‌గ‌న్ వైఖరిని మెజారిటీ ప్ర‌జ‌లు స్వాగ‌తిస్తున్నా రు. స‌మ‌యం కాన‌ప్పుడు.. దూకుడు చూపించి ప్ర‌యోజ‌నం ఏంట‌ని వారు కూడా ప్ర‌శ్నిస్తున్నారు. నాడు.. నేడు., అమ్మ ఒడి.. స‌హా ఇత‌ర‌త్రా అనేక ప‌థ‌కాల‌తో ప్ర‌జ‌ల‌ను మెప్పించిన జ‌గ‌న్‌.. భ‌రోసా.. ప్ర‌జ‌లేన‌ని స‌ర్వేలు చెబుతున్నాయి. ఇటీవ‌ల వ‌చ్చిన సీ ఓటరు స‌ర్వేలో.. ఇదే విష‌యం స్ప‌ష్ట‌మైంది. అత్యంత ప్ర‌జాగ్ర‌హం ఉన్న సీఎంగా.. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిల‌బ‌డితే.. ప్ర‌జ‌ల‌కు అనుకూల‌మైన ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ నిలిచారు. సో.. దీనిని బ‌ట్టి.. వైసీపీ అస‌లు ధైర్యం ఏంటో తెలుస్తోంద‌ని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: