జ‌గ‌న్‌ను మ‌ళ్లీ గెలిపించేందుకు పీకే కొత్త ఫార్ములా ఇదే...!

VUYYURU SUBHASH
ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల‌ను ఎదుర్కొనేందుకు సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అప్పుడే అస్త్ర శ‌స్త్రాల‌ను సిద్ధం చేసుకుంటున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ గెలిచేందుకు ఆయ‌న చేసిన సుధీర్ఘ‌మైన పాద‌యాత్ర తో పాటు ప్ర‌శాంత్ కిషోర్ రాజ‌కీయ వ్యూహాలు కూడా బాగా ప‌నిచేశాయి. ఈ క్ర‌మంలోనే 2019 ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు ఏకంగా 151 సీట్లు ఇచ్చి.. బంప‌ర్ మెజార్టీతో జ‌గ‌న్ ను సీఎం చేశారు. జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయ్యాక గత రెండున్నరేళ్ల కాలంలో స్థానిక ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉంద‌న్న‌ది వాస్త‌వం.

జ‌గ‌న్ సైతం ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేల పనితీరుపై నివేదికలు తెప్పించుకుని ప‌ని తీరు స‌రిగా లేని ఎమ్మెల్యే ల‌కు వార్నింగ్ లు ఇస్తూనే వ‌స్తున్నారు. ఓవ‌రాల్ గా చూస్తే ఏపీ లో జ‌గ‌న్ ప్రభుత్వం పై న, జగన్ పై కంటే కూడా లోక‌ల్ గా ఎమ్మెల్యేలపైనే ఎక్కువ వ్యతిరేకత క‌నిపిస్తోంది. అయితే ఇప్పుడు మ‌రో సారి జ‌గ‌న్ కోసం పీకే రంగంలోకి దిగుతున్నారు. 2022 మార్చి నుంచి పీకే రంగంలోకి దిగి ఎమ్మెల్యేలు, ప్ర‌భుత్వం ప‌ని తీరుపై నివేదిక‌లు ఇవ్వ‌ను న్నారు.

ఈ క్ర‌మంలోనే ఇప్పుడు పీకే ఇక్క‌డ జ‌గ‌న్ కోసం పశ్చిమ బెంగాల్ ఫార్ములా ను అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నార‌ట‌. అక్క‌డ మ‌మ‌తా బెన‌ర్జీ మూడో సారి అధికారంలోకి వ‌చ్చారు. అయితే చాలా మంది ఎమ్మెల్యే ల‌పై వ్య‌తిరేక‌త ఉంది. అక్క‌డ జ‌నాలు మ‌మ‌త ప‌ట్ల ప్రేమ‌తో ఉన్నా ఎమ్మెల్యేల ప‌ని తీరుపై ఆగ్ర‌హం తో ఉన్నారు. అందుకే పీకే గ‌త ఎన్నిక‌ల్లో చాలా మంది సిట్టింగ్ ల‌కు టిక్కెట్లు రాకుండా చేశారు.

కొత్త వారితో ఎన్నిక‌ల‌కు వెళ్లి ఘ‌న విజ‌యం సాధించారు. ఇప్పుడు ఏపీలోనూ అదే ఫార్ములా ను ప్ర‌యోగించి మ‌ళ్లీ జ‌గ‌న్ ను సీఎం ను చేయాల‌ని ఆయ‌న ప్లాన్ చేస్తున్నార‌ట‌. మ‌రి పీకే వ్యూహాలు ఈ సారి జ‌గ‌న్ కు ఎంత‌లా వ‌ర్క‌వుట్ అవుతాయో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: