బ‌ద్వేలు: జ‌గ‌న్ ప్ర‌చారానికి ఎందుకు రాలేదు ?

VUYYURU SUBHASH
బ‌ద్వేల్ ఉప ఎన్నిక ప్ర‌చారానికి జ‌గ‌న్ వ‌స్తార‌ని ముందు నుంచి అనుకున్నారు. అయితే జ‌గ‌న్ మాత్రం ప్ర‌చారానికి రాలేదు. జగన్ కేవలం బ‌ద్వేల్ ఓట‌ర్ల‌కు లేఖలు రాసి సరిపెట్టారు. జగన్ బద్వేల్ లో అడుగుపెడితే ఆ సందడి మాత్రం వేరేగా ఉండేది. అయితే జ‌గ‌న్ మాత్రం ఇక్క‌డ ప్ర‌చారానికి వ‌చ్చేందుకు ఇష్ట ప‌డ‌లేదు. గ‌తంలో నంద్యాల ఉప ఎన్నిక టైంలో చంద్ర‌బాబు తో పాటు టీడీపీ వాళ్లు చేసిన అతి ప్ర‌చారం పై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అప్పుడు జ‌గ‌న్ ఏకంగా 13 రోజుల పాటు నంద్యాల లో మ‌కాం వేసీ మ‌రీ ప్ర‌చారం చేశాడు. ఇప్పుడు ఈజీ గెలిచే చోటకు తాను వెళ్ల‌డం ఎందుక‌నే జ‌గ‌న్ భావించి ఉంటారు. అందుకే ఓ లేఖ రాసి స‌రిపెట్టేశారు.

ఈ ఉప ఎన్నిక‌కు పెద్ద గా పార్టీ నేత‌ల‌ను అక్క‌డ మోహ‌రించాల్సిన అవ‌స‌రం కూడా లేద‌ని జ‌గ‌న్ ముందే నిర్ణ‌యం తీసుకున్నారు. ఇక్క‌డ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న టీడీపీ తో పాటు జ‌న‌సేన కూడా పోటీ చేయ‌డం లేదు. అందుకే జ‌గ‌న్ తాను రాకుండానే ల‌క్ష మెజార్టీ రావాల‌ని స్థానిక నేత‌ల‌కు టార్గెట్ పెట్టారు. జ‌గ‌న్ ప్ర‌చారానికి రాకుండా కూడా ల‌క్ష మెజార్టీ వ‌స్తేనే అప్పుడు కిక్ ఉంటుంద‌ని జ‌గ‌న్ భావిస్తున్నార‌ట‌. ఎక్కువ పోలింగ్ జ‌రిగితే జ‌గ‌న్ పెట్టిన ల‌క్ష మెజార్టీ టార్గెట్ పెద్ద క‌ష్ట‌మేం కాదు.

తిరుప‌తి ఉప ఎన్నిక‌ల్లో వైసీపీ గెలిచినా ఆ పార్టీ అనుకున్న స్థాయిలో మెజార్టీ అయితే రాలేదు. జ‌గ‌న్ కూడా అప్పుడు అసంతృప్తి చెందారు. అయితే అప్పుడు క‌రోనా ఉంద‌ని వైసీపీ నేత‌లు జ‌గ‌న్ కు సాకులు చెప్పి ఆయ‌న కోపాన్ని చ‌ల్లార్చారు. అయితే ఇప్పుడు మాత్రం ఆ ఛాన్స్ లేదు. మ‌రి జ‌గ‌న్ ప్ర‌చారానికి రాకుండానే బంప‌ర్ మెజార్టీ కొట్టిస్తే మ‌నోడి రేంజ్‌, క్రేజ్ మ‌రింత గా పెరుగుతుంద‌నేది వేరే చెప్ప‌క్క‌ర్లేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: